
| Movie Name | Kotha Bangaru Lokam (2008) |
|---|---|
| Director | Srikanth Addala |
| Star Cast | Varun Sandesh, Swetha Basu Prasad |
| Music | Mickey J Meyer |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
నీ ప్రశ్నలు నీవే… ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే… ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను… తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో… తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో… నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో… కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే… అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో… సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా… అనుకుంటే అతి సులువా
పొరపడినా పడినా జాలిపడదే… కాలం మనలాగా
ఒక నిమిషం కూడా… ఆగిపోదే నువ్వొచ్చేదాకా
అలలుండని కడలేదని… అడిగేందుకే తెలివుందా
కలలుండని కనులేవని… నిత్యం నిదరోమందా
గతముందని గమనించని… నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి… గమ్యం అంటూ ఉందా
వలపేదో వల వేస్తుంది… వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంత వరకు… వివరించే ఋజువేముంది
సుడిలోపడు ప్రతి నావ… చెబుతున్నది వినలేవా
పొరబాటున చేజారిన… తరుణం తిరిగొస్తుందా
ప్రతి పూటోక పుటగా… తన పాఠం వివరిస్తుందా
మన కోసమే తనలో తను… రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనే… పెను చీకటి చెబుతుందా
కడ తేరని పయనాలెన్ని… పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరిగేశాయా చరిత పుటలు… వెనుజూడక ఉరికే వెతలు
తమ ముందు తరాలకు… స్మృతుల చితులు… అందించాల ప్రేమికులు
ఇది కాదే విధి రాత… అనుకోదేం ఎదురీత
పది నెలలు తనలో… నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో… కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే… అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో… సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా… అనుకుంటే అతి సులువా
పొరపడినా పడినా జాలిపడదే… కాలం మనలాగా
ఒక నిమిషం కూడా… ఆగిపోదే నువ్వొచ్చేదాకా
Nee Prashnalu Neeve song is from the Kotha Bangaru Lokam movie.
Nee Prashnalu Neeve song was sung by S P Balasubramanyam.
Nee Prashnalu Neeve song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Nee Prashnalu Neeve song music was composed by Mickey J Meyer.