
| Movie Name | Antham (1992) |
|---|---|
| Director | Ram Gopal Varma |
| Star Cast | Nagarjuna Akkineni, Urmila Matondkar |
| Music | RD Burman |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
నీ నవ్వు చెప్పింది నాతో
నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో
ఇన్నాళ్ళ లోటేమిటో
హో లాలా లాల… హో లాలా లాల
నీ నవ్వు చెప్పింది నాతో
నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో
ఇన్నాళ్ళలోటేమిటో
నాకై చాచిన నీ చేతిలో
చదివాను నా నిన్ననీ
హో, నాకై చాచిన నీ చేతిలో
చదివాను నా నిన్ననీ
నాతో సాగిన నీ అడుగులో
చూసాను మన రేపుని
పంచేందుకే ఒకరులేని
బతుకెంత బరువో అని
ఏ తోడుకి నోచుకోని
నడకెంత అలుపో అని
నల్లని నీ కనుపాపలలో
ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కనుపాపలలో
ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించనీ
నడిరేయి కరిగించనీ
నా పెదవిలోనూ ఇలాగే
చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన
తొలిముద్దు పెడుతుందనీ
ఏనాడైతే ఈ జీవితం
రెట్టింపు బరువెక్కునో
ఆ, ఏనాడైతే ఈ జీవితం
రెట్టింపు బరువెక్కునో
తనువూ మనసూ చెరిసగమని
పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం
సంపూర్ణమయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం
పొందేటి బంధాలకు
హో లాలా లాల… హో లలాలా లాల
నీ నవ్వు చెప్పింది నాతో
నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో
ఇన్నాళ్ళ లోటేమిటో
Nee Navvu Cheppindi song is from the Antham movie.
Nee Navvu Cheppindi song was sung by S P Balasubramanyam.
Nee Navvu Cheppindi song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Nee Navvu Cheppindi song music was composed by RD Burman.