
| Movie Name | Prathyardhi |
|---|---|
| Director | Shankar Mudavath |
| Star Cast | Rohit Behal, Akshatha |
| Music | Siddhant Prini |
| Singer(s) | Javed Ali |
| Lyricist | Suresh Gangula |
| Music Label | Aditya Music |
కుదురైన కుందనాల బొమ్మవే
ఎదలోన దాచుకున్న నమ్మవే
నువ్వే చూపేవు నాపై అమ్మల్లే ప్రేమ
ప్రాణమా ప్రణయమా
అరుదైన అందాల ఆడపిల్లవే
మనసైన మందార పూలకొమ్మవే
నాలో నింపావు నీవే ఆనందాలెన్నో
జన్మకే టెన్ టు ఫైవ్ సరిపడా
నా కన్నులలో మెరిసే కల నీదే చెలీ
ఆ వెన్నెలలా మనసే మారిపోయే సఖీ
నా కన్నులలో మెరిసే కల నీదే చెలీ
ఆ వెన్నెలలా మనసే మారిపోయే సఖీ
కాలంతోనే పరుగే తీసే
మగువా నీకే నువ్వే సాటి
లోకంతోనే పందెం కాసే
చెలియా నీకే లేరే పోటీ
నీలా నన్ను నడిపే ఓ చెలి ఉంటే
జీవితం చిరునవ్వుల పంటవ్వదా
నువ్వే చూపేవు నాపై అమ్మల్లే ప్రేమా
ప్రాణమా ప్రణయమా
నా కన్నులలో మెరిసే కల నీదే చెలీ
ఆ వెన్నెలలా మనసే మారిపోయే సఖీ
ఓ హో హో , నీతో ఉంటె అంతే చాలే
అంతే లేని ఆనందాలే
నీలా ఎవరు లేనే లేరే
ఉన్నాగాని నువ్వే వేరే
నాకంటూ ఒకరున్నారంటే నువ్వేలే
నేనంటూ ఉన్నానంటే నీవల్లే
నువ్వే చూపేవు నాపై అమ్మల్లే ప్రేమా
ప్రాణమా ప్రణయమా
నా కన్నులలో మెరిసే కల నీదే చెలీ
ఆ వెన్నెలలా మనసే మారిపోయే సఖీ
నా కన్నులలో మెరిసే కల నీదే చెలీ
ఆ వెన్నెలలా మనసే మారిపోయే సఖీ
Nee Kannulalo song is from the Prathyardhi movie.
Nee Kannulalo song was sung by Javed Ali.
Nee Kannulalo song lyrics were written by Suresh Gangula.
Nee Kannulalo song music was composed by Siddhant Prini.