
| Movie Name | & English - Prema Khaidi |
|---|---|
| Director | EVV Satyanarayana |
| Star Cast | Harish Kumar, Malashri |
| Music | Rajan-Nagendra |
| Singer(s) | S P Balasubramanyam, P Susheela |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
ఓహో ఓహో ఓహో ఓహో
ఓహో హో ఓ ఓ ఆహా హా ఆ ఆ
ఆ ఆఆ ఆఆ ఆహా ఆఆ
ఓహో ఓహో ఓహో ఓహో ఓ ఓ
నీ కళ్ళలో స్నేహము… కౌగిళ్ళలో కాలము
పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
చివురించి నవ్వే నవరంజని
నీ నవ్వులో అందము… ఈ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగార వీణ శివరంజని
పిలుపందుకున్న ప్రియ రంజని
నువ్వే ప్రాయం… ప్రాణం, ఓఓ ఓ ఓ
ఉగాదులు ఉషస్సులు… వలపున రాక
పరువమనే బరువు ఇలా… బ్రతుకున సాగే
మోడే చిగురించే… ప్రణయ కథల్లో
రాలే పూల ఆశల్లోన… మధువును నేనై
పిలుపులతో అలిసితిని… బదులిక లేక
నీవే జతలేని… శిధిల శిలల్లో
ఉంటా వెయ్యేళ్లు… చిలిపి కలల్లో
నీ నవ్వులో అందము… ఈ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగార వీణ శివరంజని
పిలుపందుకున్న ప్రియరంజని
ఓహో ఓహో ఓహో ఓహో
ఓహో హో ఓ ఓ ఆహా హా ఆ ఆ
ఆ ఆఆ ఆఆ ఆహా ఆఆ
ఓహో ఓహో ఓహో ఓహో
దిగులు పడే సొగసులతో… దినములు సాగే
రుచులడిగే వయసులలో ఋతువులు మారే
నన్నే ప్రశ్నించే… హృదయలయల్లో
పరువముతో పరిచయమే… పరువులు తీసే
చెరి సగమౌ చెలిమినిలా… చెరలకు తోసే
ప్రేమ ఖైదీగా… ప్రణయపుటల్లో
ఇంకా ఎన్నాళ్లీ… ఇరుకు గదుల్లో
నీ కళ్ళలో స్నేహము… కౌగిళ్ళలో కాలము
పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
చివురించి నవ్వే నవరంజని
నీ నవ్వులో అందము… ఈ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగార వీణ శివరంజని
పిలుపందుకున్న ప్రియ రంజని
నువ్వే ప్రాయం… ప్రాణం, ఓఓ ఓఓ
Nee Kallalo Snehamu song is from the & English - Prema Khaidi movie.
Nee Kallalo Snehamu song was sung by S P Balasubramanyam, P Susheela.
Nee Kallalo Snehamu song lyrics were written by Veturi Sundararama Murthy.
Nee Kallalo Snehamu song music was composed by Rajan-Nagendra.