
| Movie Name | Yevadu , Ram Charan |
|---|---|
| Director | Vamsi Paidipally |
| Star Cast | Ram Charan, Shruti Haasan, Amy Jackson |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Shreya Ghoshal, Karthik |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music Telugu |
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
నాకే తెలియని నను చూపించి
నీకై పుట్టాననిపించి
నీ దాక నను రప్పించావే
నీ సంతోషం నాకందించి
నా పేరుకి అర్ధం మార్చి
నేనంటే నువ్వనిపించావే, ఏ ఏఏ
నీ జతగా నేనుండాలి
నీ యెదలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
కళ్ళోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్న
రాలేదే జాడైనా లేదే
రెప్పల బయటే నేనున్నా
అవి మూస్తే వద్దామనుకున్న
పడుకొవే పైగా తిడతావే
లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే
వదిలేస్తావా నన్నిలా..!!
నీలోకం నాకంటే ఇంకేదో ఉందంటే
నమ్మే మాటలా, ఆ ఆఆ
నీ జతగా నేనుండాలి
నీ యెదలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి
తెలిసీ తెలియక వాలింది
నీ నడుమొంపుల్లో నలిగింది, నా చూపు
ఏం చేస్తాం చెప్పు..!!
తోచని తొందర పుడుతుంది
తెగ తుంటరిగా నను నెడుతోంది, నీ వైపు
నీదె ఆ తప్పు..!!
నువ్వంటే నువ్వంటు… ఏవేవో అనుకుంటు
విడిగా ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ దూరాన్నే తరిమేస్తు
ఒకటవ్వాలిగా, ఆ ఆఆ ఆ
నీ జతగా నేనుండాలి
నీ ఎ దలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి, ఈ ఈ
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి, ఈ ఈ
Nee Jathaga Nenundali song is from the Yevadu , Ram Charan movie.
Nee Jathaga Nenundali song was sung by Shreya Ghoshal, Karthik.
Nee Jathaga Nenundali song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Nee Jathaga Nenundali song music was composed by Devi Sri Prasad.