
| Movie Name | Nee Dhayalo |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Jonah Samuel |
| Singer(s) | Jonah Samuel |
| Lyricist | D.Sujeev Kumar |
| Music Label |
నీ దయలో నీ కృపలో… కాచితివి గత కాలము
నీ దయలో నీ నీడలో… దాచుమయా జీవితాంతము
నీ ఆత్మతో… నను నింపుమా
నీ సేవలో ఫలియింపగా… దేవా దేవా
కష్టకాలం, దుఃఖ సమయం… నన్ను వేధించగా
ప్రాణహితులే నన్ను విడచి… వెలిగ నను చూడగా ||2||
ఓదార్పువై నా చెంత… నీవే ఉండినావు
నా కన్నీటిని కవిలలో… దాచి ఉంచినావు ||2||
ఏమి అద్భుత ప్రేమయా… ఏ రీతి పాడనయా
నీవే నా మార్గము… నీవే నా జీవము
నీవే నా గమ్యము… నీవే నా సర్వము
నా మనసుతీరా నిన్ను పాడి… పొగడెద దేవా
నీ దయలో నీ కృపలో… కాచితివి గత కాలము
నీ దయలో నీ నీడలో… దాచుమయా జీవితాంతము
ఏ యోగ్యతయు లేని నా యడ… నీ కృప చూపితివి
వట్టి పాత్రను మహిమతో నింపి… మార్గము నీవైతివి ||2||
నీ చిత్తమే నా యందు… నెరవేర్పవ్వాలని
నీ సేవయే నా శ్వాసగా… కడవరకు నిలవాలని ||2||
నా మది నిండెను ఆశతో… నే పాడెద స్తుతి గీతం
నీవే నా తోడుగా… నీవే నా నీడగా
ఆత్మతో నింపుమా… శక్తి నాకొసగుమా
నా చేయి పట్టి నన్ను నీతో… నడుపుము దేవా
నీ దయలో నీ కృపలో… కాచితివి గత కాలము
నీ దయలో నీ నీడలో… దాచుమయా జీవితాంతము
నీ ఆత్మతో… నను నింపుమా
నీ సేవలో ఫలియింపగా… దేవా దేవా
Nee Dayalo Nee Krupalo song is from the Nee Dhayalo movie.
Nee Dayalo Nee Krupalo song was sung by Jonah Samuel.
Nee Dayalo Nee Krupalo song lyrics were written by D.Sujeev Kumar.
Nee Dayalo Nee Krupalo song music was composed by Jonah Samuel.