
| Movie Name | |
|---|---|
| Director | K Raghavendra Rao |
| Star Cast | Nagarjuna Akkineni, Vijayashanthi, Jeevitha |
| Music | KV Mahadevan |
| Singer(s) | S P Balasubramanyam, S Janaki |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
నీ చరణం కమలం మృదులం
నా హృదయం పదిలం పదిలం
నీ చరణం కమలం మృదులం
నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే… రస వేదాలు
నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు
ఏడేడు జన్మాలు… ఊఊ ఊఊ ఊఊ
ఆఆఆ ఆఆ ఆఆఆ ఆఆ ఆఆఆ ఆఆ
నీ చరణం కమలం మృదులం
నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు
నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు
ఏడేడు జన్మాలు, ఊఊ ఊఊ ఊఊ
నీ చరణం కమలం మృదులం
నా హృదయం పదిలం పదిలం
మువ్వలు పలికే మూగతనంలో
మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో
చూపున సంధ్యారాగాలు
మువ్వలు పలికే మూగతనంలో
మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో
చూపున సంధ్యారాగాలు
అంగ అంగమున అందచందములు
ఒంపు ఒంపున హంపి శిల్పములు
అంగ అంగమున అందచందములు
ఒంపు ఒంపున హంపి శిల్పములు
ఎదుటే నిలిచిన చాలూ
ఆరారు కాలాలు, ఊఊ ఊఊ ఊఊ
నీ చరణం కమలం మృదులం
నా హృదయం పదిలం పదిలం
నీ చరణం కమలం మృదులం
నా హృదయం పదిలం పదిలం
జతులే పలికే జాణతనంలో
జారే పైటల కెరటాలు
శృతులే కలిసే రాగతనంలో
పల్లవించిన పరువాలు
జతులే పలికే జాణతనంలో
జారే పైటల కెరటాలు
శృతులే కలిసే రాగతనంలో
పల్లవించిన పరువాలు
అడుగు అడుగున రంగవల్లికలు
పెదవి అడుగున రాగమాలికలు
అడుగు అడుగున రంగవల్లికలు
పెదవి అడుగున రాగమాలికలు
ఎదురై పిలిచినా చాలు, ఊఊ ఊ
నీ మౌన గీతాలు… ఊఊ ఊఊ ఊఊ
నీ చరణం కమలం మృదులం
నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు
నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు
ఏడేడు జన్మాలు, ఊఊ ఊఊ ఊఊ.
Nee Charanam Kamalam song is from the movie.
Nee Charanam Kamalam song was sung by S P Balasubramanyam, S Janaki.
Nee Charanam Kamalam song lyrics were written by Veturi Sundararama Murthy.
Nee Charanam Kamalam song music was composed by KV Mahadevan.