| Movie Name | Sai Chand |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | Sai Chand |
| Lyricist | Sai Chand |
| Music Label |
నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న…
నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న…
మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు… అమ్మ మనసు కష్ట పెట్టలేదట
మేము భూమి మీద పడ్డవేళప్పుడు… బాధలన్ని మర్సి పోయినావట
ముద్దు పెట్టుకోని గుండెకత్తుకుంటావూ… ఊఉ ఊ
ముద్దు పెట్టుకోని గుండెకత్తుకుంటావూ…
బారసాల చేసి గాబురంగ సూసుకుంటవూ…
నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… ||2||
ఏలు పట్టుకొని నడక నేర్పుతవ్… ఎదల మీద ఎత్తుకోని ముర్సిపోతావూ
మంచి చెడ్డలన్ని మాకు చెప్పుతవ్… మేము ఎదుగుతుంటే నువ్వు పొంగి పొతవూ
బుద్దులెన్నో చెప్పుతవ్… బుజ్జగింజుతవ్… ఊఉ ఊ
బుద్దులెన్నో చెప్పుతవ్… బుజ్జగింజుతవ్
మా తప్పులన్ని నవ్వుతోనే మన్నించుతవ్…
నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… ||2||
కుటుంబ భారమంత మోసుకొస్తవూ… బాధ్యతకు మారుపేరు అయినవూ
కష్టమంత కడుపులోన దాసుకుంటవూ… నీ కన్నీళ్లు కంటిరెప్ప దాటనియ్యవూ
మేము ఒక్క పూట పస్తులున్న సూడలేవయ్యా… ఆ ఆఆ
మేము ఒక్క పూట పస్తులున్న సూడలేవయ్యా…
నువ్వు ఎన్ని పస్తులున్నవో చెప్పలేమయ్యా…
నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… ||2||
మేము కోరుకున్నదేది కాదనవూ… మా మనసుకు బాధ కలగనియ్యవూ
నీ యెదల ఎన్ని బాధలున్నాగాని… మా క్షేమమే నువ్వు కోరుకుంటవూ
నీ త్యాగమెంత పొగిడినా కొంచమేనయ్యా… ఆ ఆఆ
నీ త్యాగమెంత పొగిడినా కొంచమేనయ్యా…
త్యాగశీలి నాన్న నీకు వందనాలయ్యా…
నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… ||2||
Check Father Songs Lyrics
Nanna Nanna Nee Manasentha Manchido Nanna song is from the Sai Chand movie.
Nanna Nanna Nee Manasentha Manchido Nanna song was sung by Sai Chand.
Nanna Nanna Nee Manasentha Manchido Nanna song lyrics were written by Sai Chand.