
| Movie Name | & English - First Show |
|---|---|
| Director | Jagadish KK |
| Star Cast | Surya Bharath Chandra, Priya |
| Music | Vamsikanth Rekhana |
| Singer(s) | Anudeep Dev |
| Lyricist | Subham Viswanadh |
| Music Label | Aditya Music |
Nadiche Chandamama Lyrics In Telugu
నడిచే చందమామతో సాగిపొమ్మని
హృదయం రాసుకుందిలే ఎపుడో మౌనంగా
మనసే అందుకే ఇలా నన్నే కసిరిపొమ్మని
నీతో కొత్తదారిలో నన్నే నడిపిందే
మార్చేసావే మనసారా… నీ అందంతో చెలితారా
దీని పేరు ప్రేమని ఆశగా ఉందిలే
దీని తీరు హాయని… తెలిసిందే నీ వలనే
మధురం మధురం ఈ ప్రణయం తొలి పరువంలో
జరిగే మధనం నీకోసం… విరహపు నదిలో
మెరిసే గగనం నీ నయనం వసుధావనిలో
కురిసే రచనం ఆ అధరం చెలి పిలుపులలో
వెన్నెలే నీకోసమే ఓ వేకువై ఉదయిస్తుందే
అందుకే ఈ లోకమే నీ వైపే చూస్తుందే
ఎందుకో ఇన్నాల్లిలా లేనంత వింత వైభవం
అందమై వాలిందిలే నా కళ్ళ ముందరే
కలవరమో తొలివరమో… తెలియని ఈ భావం
మునుపెపుడు ఎరగనిదే… ప్రేమే ఈ గానం
కవినైపోయా నీ వలనే… ఓ ప్రియలలన
కలలో కథలో నీ జపమే… మరువను వదనా
వలపో మలుపో తెలియదులే… మన్మథ రచన
వలచే వరకు విడువనులే… సొగసుల సదనా
ప్రాణమే ఓ వేణువై… ఈ గానమే వినిపిస్తున్నా
పాదమే జలపాతమై… నీ వెంటే వస్తున్నా
అద్భుతం నాలో సగం… నువు చేరువైన ఈ క్షణం
అంకితం నా జీవితం… నీ సొంతమైనదే
పరవశమే పరిమళమై నాలో నిండిందే
ప్రతి నిమిషం నీ తలపే చంపేస్తూ ఉందే
Nadiche Chandamama song is from the & English - First Show movie.
Nadiche Chandamama song was sung by Anudeep Dev.
Nadiche Chandamama song lyrics were written by Subham Viswanadh.
Nadiche Chandamama song music was composed by Vamsikanth Rekhana.