| Movie Name | 1996 (1996) |
|---|---|
| Director | Viswajagath |
| Star Cast | Gagaan Viharri, Aparna Devi |
| Music | Osho Venkat |
| Singer(s) | Chinmayee Sripada, Amala Chebolu, Sri Krishna |
| Lyricist | Jagath |
| Music Label |
నడిచా నడిచా నీ అడుగుతోనే
ఏడడుగులవ్వాలనీ
వేచా వేచా నీ వేలు కొరకే
ఈ జన్మనివ్వాలని
ఏడేడు లోకాలు మన వెంట రావా
ఈ జంట కనలేదనీ
నే వేడుకోనా నా గుండె గుడిని
నీ తోడు ఎన్నటికీ విడబోననీ
నడిచా నడిచా… నీ అడుగుతోనే
ఏడడుగులవ్వాలనీ
వేచా వేచా… నీ వేలు కొరకే
ఈ జన్మనివ్వాలనీ
నీతోటి గడిపేటి ఈ ఘడియలే
ముమ్మాటికీ మారవే
నన్నంటినా నీటి ఈ గురుతులే
ఏనాటికీ చెరగవే
గోదారి సాక్షాలు… పక్షుల్ల రాగాలు
మన పెళ్లి మంత్రాలుగా
ఇక నిండు నూరేళ్ళు
మన జంట జగతంతా
వర్ధిల్లి తీరాలిగా
వెతికా వెతికా కనులార పతికై
కరుణించి పంపాడుగా
నిలిచా నిలిచా నీరాకకొరకై
నా చెంత చేరావుగా
Nadichaa Nadichaa song is from the 1996 movie.
Nadichaa Nadichaa song was sung by Chinmayee Sripada, Amala Chebolu, Sri Krishna.
Nadichaa Nadichaa song lyrics were written by Jagath.
Nadichaa Nadichaa song music was composed by Osho Venkat.