
| Movie Name | & English - Varsham |
|---|---|
| Director | Sobhan |
| Star Cast | Prabhas, Trisha, Gopichand |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Adnan Sami, Suneeta Rao |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
Nachave Nizam Pori Lyrics In Telugu
హోయ్, హేయ్, నచ్చావే నైజాం పోరి… నువ్వే నా రాజకుమారి
హే, ఆజారే రాజా జానీ… లేజారే లేత జవానీ
హేయ్ నచ్చావే నైజాం పోరి… నువ్వే నా రాజకుమారి
ఆజారే రాజా జానీ… లేజారే లేత జవాని
అందిస్తే చెయ్యి ఓసారి… ఎక్కిస్తా ఏనుగంబారి
శాసిస్తే చాలు ఓ సారి… సిద్దంగా ఉంది సింగారి
అయ్యారే సయ్యంటుందే తయ్యారై వయ్యారి
నచ్చావే నైజాం పోరి… నువ్వే నా రాజకుమారి
ఆజారే రాజా జానీ… లేజారే లేత జవాని
హేయ్, సరదాగా సరసకు చేరి… సాగిస్తా సొగసుల చోరీ
చాల్లెద్దూ మాటకచేరి… దోచేద్దూ తళుకుతే జారీ
ముదిరావే మాయలమారి… మురిపిస్తే ఎలా మురారి
హేయ్, పరిచానే మల్లెపూదారి… పరిగెత్తుకు రావె పొన్నారి
పిలిచాడే ప్రేమ పూజారి… వెళిపోదా మనసే చేజారి
గుండెల్లో కోవెల కట్టా… కొలువుండవే దేవేరి
నచ్చావే నైజాం పోరి… నువ్వే నా రాజకుమారి
ఆజారే రాజా జానీ… లేజారే లేత జవాని
హే, వరదల్లే హద్దులు మీరి… వచ్చావా పొగడల పోరి
హ్మ్, సుడిగాలే నిలువున నిమిరి… ఎగరేసుకుపోతా నారి
దాటొస్తా సిగ్గుల ప్రహరి… హేయ్, చేరుస్తా చుక్కల నగరి
ముద్దుల్లో ముంచి ఓసారి… మబ్బుల్లో తేల్చి ఓ సారి
మైకంలో తూరి ఓ సారి… కావ్యంలో వాలి ఓసారి
వాహ్ వారే అనిపించాలి… వాటేసే ప్రతిసారి
హే నచ్చావే నైజాం పోరి… నువ్వే నా రాజకుమారి
ఆజారే రాజా జానీ… లేజారే లేత జవాని
Nachave Nizam Pori song is from the & English - Varsham movie.
Nachave Nizam Pori song was sung by Adnan Sami, Suneeta Rao.
Nachave Nizam Pori song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Nachave Nizam Pori song music was composed by Devi Sri Prasad.