
| Movie Name | Ramu, Tony |
|---|---|
| Director | Mohan Marripelli |
| Star Cast | |
| Music | Madeen SK |
| Singer(s) | Ramu |
| Lyricist | Ramesh Pagilla |
| Music Label |
ఎవరు లేరని ఉన్న వాడిని
నీ బాగే కోరి మళ్ళీ ఒంటరైతిని
నీ పాద పారాణి ఆరకముందే
తుంచేసిందా విధి నీ తాళినే
ఊగే ఊయల… నేల కూలినట్టుందే
కూసే కోయిల… కూత మరిసినట్టుందే
నిన్నిలా చూస్తూ ఉంటే, ఆ ఆ
సేతి గీతలు నమ్మి… సూపు సూపు కలిపి
తోడు చూసారా, ఆ ఆ… బంధమేశారా
ఈ దాగుడుమూతల దయలేని
సేతల ఆగమైపోతివో, ఆ ఆఆ
ఈ బారెడు టెన్ టు ఫైవ్ ఆశలు
దాసిన గుండెల్లో బాధనే మోస్తివో
చిట్టఅడవిలోన ఉచ్చులో చిక్కిన
పక్షిలా అయినావే
నా సిన్ని మైనా… నా సిన్ని గుండెలో
ఏమైనా నిను మళ్ళి రమ్మంటున్న
రాలేవా దుఃఖాల సంద్రాలనే ఇడిసి
పోలేమా నాటి నవ్వులనే వెతికి
పోలేమా ఈనాటి గురుతులనే ఇడిసి
దిక్కులన్నీ మరిసి… దిక్కులేని దానిలా
చుట్టూ మౌనం ఇడిసి… శిలగా మిగిలావే
ఈ సీకటంటే భయమన్నదాన
సీకటిలోన ఎట్లుంటివో
నీ నవ్వులెన్నో జూపినదాన
అల్లరులన్నీ మూగబాయ
నే తోడు ఎవరు ఉన్నరే
పెంచిన కన్నప్రేమ ఉన్నదా
నీ భాద ఎవరు మోద్దురే
వచ్చిన తోడు బంధమున్నదా
పారి పారగ యేరు ఎండినట్టుందే
ఆకు రాలక చెట్టు మాడినట్టుందే
నిన్నిలా చూస్తుంటే..!
నా సిన్ని మైనా… నా సిన్ని గుండెలో
ఏమైనా నిను మళ్ళి రమ్మంటున్న
రాలేవా దుఃఖాల సంద్రాలనే ఇడిసి
పోలేమా నాటి నవ్వులనే వెతికి
పోలేమా ఈనాటి గురుతులనే ఇడిసి
ఉన్నపాటు నువ్వుంటే
చూడలేనే నేనంటూ
చెప్పుకోవే నేనున్నా
ఎండచాటు నీడలా
ఆ ప్రేమెంతో పంచినదాన
అగ్గిరవ్వలెన్నో నీలో ఉన్నాయో
సినుకంటే సలి యన్న దాన
కన్నీటి సుక్కలు ఎన్ని జారే
నీ తోడు నేను ఉంటనే
నీ భాద నేను మోస్తనే
నే ముందే ఇచ్చిన మాటనే
ఇక నిన్ను ఇడిసి పోనే పోనులే
మళ్ళీ మనకు ఇట్ల రాసినట్టుందే
అనుకున్న రోజు కలిసొచ్చినట్టుందే
చాలే నీకు నేనున్నా..!
నా సిన్ని మైనా… నా సిన్ని గుండెలో
ఏమైనా నిను మళ్ళి రమ్మంటున్న
రాలేవా దుఃఖాల సంద్రాలనే ఇడిసి
పోలేమా నాటి నవ్వులనే వెతికి
పోలేమా ఈనాటి గుర్తులనే ఇడిసి
Naa Sinni Maina Love Failure song is from the Ramu, Tony movie.
Naa Sinni Maina Love Failure song was sung by Ramu.
Naa Sinni Maina Love Failure song lyrics were written by Ramesh Pagilla.
Naa Sinni Maina Love Failure song music was composed by Madeen SK.