
| Movie Name | Singamalle Nuvvu |
|---|---|
| Director | KS Ravikumar |
| Star Cast | Rajnikanth, Ramya Krishnan, Soundarya |
| Music | AR Rahman |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | AM Ratnam/ Siva Ganesh |
| Music Label | Saregama South |
సింగమల్లే నువ్వు శిఖరము చేరు, ఊ ఊ ఊ
శిఖరము చేరి నింగిని కోరు
నా పేరు నరసింహ
ఇంటిపేరు రణసింహ
నాతోటి ఉన్న సేన
ఉరికేటి యువసేన
చూపు ఉగ్ర నరసింహ
ఊపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే
పంజా విప్పే నరసింహ
(నరసింహ నరసింహ… నరసింహ)
మనసు ఉన్న మనిషినయ్యా
నేను మీసమున్న బాలుడయ్యా
నేను మేలు చేయు వాన్నయ్యా
మేలు మర్చిపోనయ్యా
ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా
సింగమల్లే నువ్వు
శిఖరము చేరు (నరసింహ నరసింహ)
నా పేరు నరసింహ
ఇంటిపేరు రణసింహ
నాతోటి ఉన్న సేన
ఉరికేటి యువసేన
చూపు ఉగ్ర నరసింహ
ఊపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే
పంజా విప్పే నరసింహ
మనసు ఉన్న మనిషినయ్యా
నేను మీసమున్న బాలుడయ్యా
కోట్ల కోట్ల విలువ చేసే… ఆస్తి పాస్తులొద్దు
బిరుదులెన్నో తెచ్చిపెట్టు… పదవులు వద్దు
దండాలు వేయొద్దు… మణి మకుటాలసలొద్దు
నా జన్మ భూమి ప్రేమ చాలులే
నా గోరంత చమటకు
కొండంత సిరులిచ్చి
పెంచినది ప్రజలే కదా
నా తనువును ధనమును
ప్రజలకు ప్రగతికి
పంచుట పాడి కదా
(నరసింహ నరసింహ నరసింహ)
సింగమల్లే నువ్వు శిఖరము చేరు
నా పేరు నరసింహ
ఇంటిపేరు రాణసింహ
నాతోటి ఉన్న సేన
ఉరికేటి యువసేన
చూపు ఉగ్ర నరసింహ
ఊపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే
పంజా విప్పే నరసింహ
(నరసింహ నరసింహ, నరసింహ)
హో మనసు ఉన్న మనిషినయ్యా
నేను మీసమున్న బాలుడయ్యా
నిన్ను నువ్వు నమ్మి… ముందుకు సాగు
చరితగా మారే స్థాయికి ఎదుగు
నీలో శక్తి ఉన్నదీ… దాన్ని పదును పెడితే ఫలితమున్నది
మంచి రోజు రేపే ఆరంభించవా
అరె, ఎవరి గుణం ఏమిటో
ఎవరి బలం ఏమిటో
చూసింది ఎవరంటా
అరె, విత్తనము చిన్నదంతా
మర్రి చెట్టు పెద్దదంటా
కొంత కాలం ఆగమంటా
(నరసింహ నరసింహ, నరసింహ)
సింగమల్లే నువ్వు శిఖరము చేరు
శిఖరము చేరి నింగిని కోరు
నా పేరు నరసింహ
ఇంటిపేరు రణసింహ
నాతోటి ఉన్న సేన
ఉరికేటి యువసేన
(నరసింహ, నరసింహ, నరసింహ, నరసింహ)
చూపు ఉగ్ర నరసింహ
ఊపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే
పంజా విప్పే నరసింహ
(నరసింహ, నరసింహ
నరసింహ, నరసింహ
మనసు ఉన్న మనిషివయ్యా)
నేను మీసమున్న బాలుడయ్యా
నేను మేలు చేయు వాన్నయ్య
మేలు మర్చిపోనయ్యా
ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా
సింగమల్లే నువ్వు శిఖరము చేరు
శిఖరము చేరి నింగిని కోరు
(నరసింహ)
Naa Peru Narasimha song is from the Singamalle Nuvvu movie.
Naa Peru Narasimha song was sung by S P Balasubramanyam.
Naa Peru Narasimha song lyrics were written by AM Ratnam/ Siva Ganesh.
Naa Peru Narasimha song music was composed by AR Rahman.