
| Movie Name | Na Nishidhi Gadhilo , Zee Tel |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Meenakshi Bhujang |
| Singer(s) | Dinakar, Aparna |
| Lyricist | Sagar Narayan |
| Music Label |
నిదురించే నదిలో… మొదలాయెను అలలే
ముసుగేసిన యెదలో… చిగురేసెను కలలే
నా నిశీధి గదిలో… నీ ఉషోదయాలే
జత కూడవు లేవే… ఇరు జగములు వేరే
ఆ ఎండమావుల భ్రాంతి లాంటిదే… మన ఈ బంధం
నా రాతలో ఏ గీత… నిను చూపదే సాక్ష్యం
దరి చేరని దూరం… మన కలయిక తీరం…
మునిమాపుల చందం… మన ఇరువురి పయనం, ఈ కలియిక ఎపుడూ
తెలవారే కలలే కలగలవాలన్నా… జత కుదరదులే
ఈ క్షణం తెలియని భాధను మోస్తూ ఇరువురం
అసలే కధ లేనిదే ఎందుకు కలిసాం ఇద్దరం
తీయని గాయం ఎదని భాదిస్తుందిలే…
పూదండను దారములాగా అల్లేస్తుందిలే…
చేసేదే ఏమీ లేదే… మన చేయే దాటిపోయే
కాలంతో వాదులాడే… పంథాలే మానుకో
మునిమాపుల చందం… మన ప్రేమ ప్రబంధం
జత కలవని దూరం… ఇరువురి ఈ పయనం
నా నిశీధి గదిలో… నీ ఉషోదయాలే
జత కూడవు లేవే… ఇరు జగములు వేరే
ఆ ఎండమావుల భ్రాంతి లాంటిదే… మన ఈ బంధం
నా రాతలో ఏ గీత… నిను చూపదే సాక్ష్యం
నిదురించే నదిలో… మొదలాయెను అలలే
ముసుగేసిన యెదలో… చిగురేసెను కలలే
నా సమీపమంతా… నీ వసంత కేళే
చెలి ప్రపంచమంతా… నీ కలే కనాలే
ఆ ఎండమావుల భ్రాంతి లాంటిదే… మన ఈ బంధం
నా రాతలో ఏ గీత… నిను చూపదే సాక్ష్యం
Naa Nishidhi Gadhilo song is from the Na Nishidhi Gadhilo , Zee Tel movie.
Naa Nishidhi Gadhilo song was sung by Dinakar, Aparna.
Naa Nishidhi Gadhilo song lyrics were written by Sagar Narayan.
Naa Nishidhi Gadhilo song music was composed by Meenakshi Bhujang.