
| Movie Name | Manmadhudu (2002) |
|---|---|
| Director | K Vijaya Bhaskar |
| Star Cast | Nagarjuna, Sonali Bendre, Anshu |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | S P Balasubramanyam & Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
నా మనసునే మీటకే నేస్తమా
నా దారిలో చేరకే చైత్రమా
సరదాల చిలిపితనమా
చిరునవ్వులోని స్వరమా
నా తలుపు తట్టి కదిలించకే
కవ్వించకే ప్రేమా
నా మనసునే మీటకే నేస్తమా
నా దారిలో చేరకే చైత్రమా
నాకెందుకిలా అవుతోంది
చెప్పవా ఒక్కసారి
నీ వెంటపడే ఆశలకి
చూపవా పూలదారి
చినుకల్లే చేరి వరదల్లే మారి
ముంచేస్తె తేలేదెలాగ
తడి జాడలేని తమ గుండెలోని
దాహాలు తీరేదెలాగ
లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమా
నీ కనులలో వెలగనీ ప్రియతమా
నీ పెదవికే తెలుపనీ మధురిమా
నీ ఊహలలో కొంటెతనం
పలకరిస్తోంది నన్ను
నీ ఊపిరితో అల్లుకుని
పులకరిస్తోంది వెన్ను
అలవాటుపడిన ఎద చీకటింట
సరికొత్త వేకువై రావా
కిరణాలు పడని తెరచాటులోని
ఏకాంతమే వదులుకోవా
నన్ను నేను మరిచేంతలా
మురిపించకే ప్రేమా
నీ కనులలో వెలగనీ… ప్రియతమా
నీ పెదవికీ… తెలుపనీ… మధురిమా
సరదాల చిలిపి తనమా
చిరునవ్వులోని స్వరమా
నా తలుపు తట్టి కదిలించకే
కవ్వించకే ప్రేమా
Watch నా మనసునే Song
Naa Manasune song is from the Manmadhudu movie.
Naa Manasune song was sung by S P Balasubramanyam & Chitra.
Naa Manasune song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Naa Manasune song music was composed by Devi Sri Prasad.