
| Movie Name | Nuvve Nuvve (2002) |
|---|---|
| Director | Trivikram |
| Star Cast | Tarun, Shreya |
| Music | Koti |
| Singer(s) | Udit Narayan & Nithya Santhoshini |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
అర్రెర్రె రె రె ర్రే రె రె ర్రే
అర్రెర్రె రె రె ర్రే రె రె ర్రే
నా మనసుకేమయింది
నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా
నాకు అలాగె ఉంది
ఎన్నో అనాలనుంది
దాచేదెలా లోలోపలా
మన ఇద్దరికి తెలియంది
ఏదో జరిగే ఉంటుంది
అందుకే ఇంతలా
గుండె ఉలికి పడుతు ఉంది
నా మనసుకేమయింది
నీ మాయలో పడింది
నిజమా కలా… తెలిసేదెలా
చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది
నీ మీద నాకున్న ప్రేమ
కొత్తగా ఉంది బొత్తిగా
నమ్మలేనంత ఈ వింత ధీమా
జంటగా వెంట నువ్వుంటే
అందడా నాకు ఆ చందమామ
అందుకే నాకు నువ్వంటే
మాటలో చెప్పలేనంత ప్రేమ
పంచుకున్న ముద్దులో… ఇలా జతే పడి
పెంచుకున్న మత్తులో… పడి మతే చెడి
గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని
నా మనసుకేమయింది… నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా
ఎప్పుడూ గుండె చప్పుడు
కొట్టుకుంటుంది నీ పేరు లాగ
ఎప్పుడో అప్పుడప్పుడు
గుర్తుకొస్తొంది నా పేరు కొద్దిగా
ఒంటిగా ఉండనివ్వదు
కళ్ళలో ఉన్న నీ రూపురేఖ
ఇంతగా నన్ను ఎవ్వరూ
కమ్ముకోలేదు నీలా ఇలాగ
లోకమంటే ఇద్దరే అదే మనం అని
స్వర్గమంటే ఇక్కడే అంటే సరే అని
వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథని
నా మనసుకేమయింది
నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా
మన ఇద్దరికి తెలియంది
ఏదో జరిగే ఉంటుంది
అందుకే ఇంతలా గుండె
ఉలికి పడుతు ఉంది
Naa Manasukemaindi song is from the Nuvve Nuvve movie.
Naa Manasukemaindi song was sung by Udit Narayan & Nithya Santhoshini.
Naa Manasukemaindi song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Naa Manasukemaindi song music was composed by Koti.