
| Movie Name | Pelli Peetalu (1998) |
|---|---|
| Director | S V Krishna Reddy |
| Star Cast | Jagapati Babu, Soundarya |
| Music | S V Krishna Reddy |
| Singer(s) | Krishnam Raju & Pallavi |
| Lyricist | Chandra Bose |
| Music Label | Aditya Music India |
మోహనం మోహనం ప్రేమంటే మోహనం
(ప్రేమంటే మోహనం)
మోహనం మోహనం… ప్రేమిస్తే మోహనం
(ప్రేమిస్తే మోహనం)
చెలి పాదం మోపేటి నేలను చూస్తే
ప్రియుడికి మోహనమంట
చెలి జడకై పూసేటి పూలను చూస్తే
సఖుడికి మోహనమంట
(నిస సస నిస సస నిస సస నిసగగస నిసగగస
నిస సస నిస సస నిస సస నిసగగస నిసగగస)
మోహనం మోహనం ప్రేమంటే మోహనం
(ప్రేమిస్తే మోహనం)
మోహనం మోహనం… ప్రేమిస్తే మోహనం
(ప్రేమంటే మోహనం)
(లలలల లల లలాలా లలాలా
లలలల లల లలాలా లలాలా)
అమ్మాయి గుండెల్లో అంగుళమో చోటే
ఏ ఏ ఏఏ ఏ… వహ్ వా వహ్ వా
అమ్మాయి గుండెల్లో అంగుళమో చోటే
అబ్బాయికి ఆరడుగుల మోహనమంటా
నిలువున మోహనమంటా
(ఇరవై మోహనమంటా)
ప్రియురాలి పెదవుల్లో కాసింత నవ్వే
ప్రేమికుడికి కొండంత మోహనమంటా
మనసైన మనిషి మనవెంట ఉంటే
పయనించే ఫర్లాంగు మోహనమేనంటా
(నిస సస నిస సస నిస సస నిసగగస నిసగగస
నిస సస నిస సస నిస సస నిసగగస నిసగగస)
మోహనం మోహనం ప్రేమంటే మోహనం
(ప్రేమిస్తే మోహనం)
మోహనం మోహనం… ప్రేమిస్తే మోహనం
(ప్రేమంటే మోహనం)
చెలికాడు తననెంతో పొగిడేటి మాటే
ఏ ఏ ఏఏ ఏ… వహ్ వా వహ్ వా
చెలికాడు తననెంతో పొగిడేటి మాటే
నిజమైనా కాకున్నా మోహనమంటా
చెలికి మోహనమంటా
(తెలియని మోహనమంటా)
అతగాడు నోరారా పాడేటి పాటే
అపస్వరమే అవుతున్నా మోహనమంటా
మదిపంచువాళ్ళు మన చెంతనుంటే
మరుప్రణమే కావైనా మోహనమేనంటా
(నిస సస నిస సస నిస సస నిసగగస నిసగగస
నిస సస నిస సస నిస సస నిసగగస నిసగగస)
మోహనం మోహనం ప్రేమంటే మోహనం
(ప్రేమిస్తే మోహనం)
మోహనం మోహనం… ప్రేమిస్తే మోహనం
(ప్రేమంటే మోహనం)
ప్రేమల్లో పడ్డాక కష్టం కూడా
కమ్మని మోహనమంటా
ప్రేమల్లో మునిగాక చీకటి కూడా
పున్నమి మోహనమంటా
(నిససస నిససస పససస నిస పమగసనిస పమగసనిస
నిససస నిససస పససస నిస పమగసనిస పమగసనిస)
మోహనం మోహనం… ప్రేమంటే మోహనం
మోహనం మోహనం… ప్రేమిస్తే మోహనం
మోహనం మోహనం… ప్రేమంటే మోహనం
Mohanam Mohanam song is from the Pelli Peetalu movie.
Mohanam Mohanam song was sung by Krishnam Raju & Pallavi.
Mohanam Mohanam song lyrics were written by Chandra Bose.
Mohanam Mohanam song music was composed by S V Krishna Reddy.