| Movie Name | |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label | Vel Records |
ఓ.. మై డియర్ గర్ల్స్… డియర్ బాయ్స్…
డియర్ మేడమ్స్… భారతీయులారా…!
ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే చేరింది…
మహమ్మారి రోగమొక్కటి…
ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి.. ఉక్కు సంకల్పంతో..
తరుముదాము దాన్ని బయటికి…
వి విల్ స్టే ఎట్ హోమ్… వి విల్ స్టే ఎట్ హోమ్…
వి స్టే సేఫ్…
వి విల్ స్టే ఎట్ హోమ్… వి విల్ స్టే ఎట్ హోమ్…
వి స్టే సేఫ్…
ఉత్తుత్తి వార్తలు.. పుకారులన్నీ నమ్మకండి…
అదిగో పులి అంటే ఇదిగో తోక అని బెదరకండీ…
విందులు, పెళ్ళిళ్ళు, వినోదాలు కాస్త మానుకోండి…
బతికుంటే బలుసాకు తినగలమని తెలుసుకోండి…
కాస్తయిన వ్యాయామం రోజు చెయ్యండి… కూస్తయిన వేన్నీళ్లు తాగుతుండండి…
అనుమానం వచ్చిన ప్రతిసారి.. వెనువెంటనే చేతులు కడుగుతుండండి…
ఇల్లు, ఒళ్ళు, మనసు శుభ్రపరచుకుంటే… ఇలలోనే ఆ స్వర్గాన్ని చూడొచ్చండీ…
ఇష్ట దేవతల్ని కాస్త తలచుకుంటే.. ఏ కష్టమైన అవలీలగా దాటొచ్చండీ…
వి విల్ స్టే ఎట్ హోమ్… వి విల్ స్టే ఎట్ హోమ్…
వి స్టే సేఫ్…
వి విల్ స్టే ఎట్ హోమ్… వి విల్ స్టే ఎట్ హోమ్…
వి స్టే సేఫ్…
ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే చేరింది…
మహమ్మారి రోగమొక్కటి…
ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి.. ఉక్కు సంకల్పంతో..
తరుముదాము దాన్ని బయటికి…
సొంత ప్రాణాలను పణంగ పెట్టిన త్యాగమూర్తులు… మనలోనే ఉన్నారు
మనుషుల్లో దేవుళ్ళు డాక్టర్లు, నర్సులు…
కనబడని శత్రువుతో పోరాటం చేస్తున్న సమరయోధులు…
పోలీసులంటే ఎవరో కాదు మన కుటుంబ సభ్యులు…
చెత్తని, మురికిని, మలినాలనన్నీ… ఎత్తి పారేసేటి ఏక వీరులు…
పారిశుధ్య పనులు చేసే చేతులకి సరిపోవు వేవేల కోటి దండాలు…
కన్న తల్లితండ్రి కూడ చాలారండీ.. ఏమిచ్చుకుంటె వారి ఋణం తీరేనండి..
మానవ సేవకు అంకితమైన వాళ్లు.. క్షేమంగానే ఉండాలని ప్రార్థించండీ…
వి విల్ స్టే ఎట్ హోమ్… వి విల్ స్టే ఎట్ హోమ్…
వి స్టే సేఫ్…
వి విల్ స్టే ఎట్ హోమ్… వి విల్ స్టే ఎట్ హోమ్…
వి స్టే సేఫ్…
MM Keeravaani We Will Stay At Home Covid19 song is from the movie.