
| Movie Name | Seethakoka Chiluka |
|---|---|
| Director | Bharathiraja |
| Star Cast | Karthik, Mucherla Aruna, Silk Smitha, Sarath Babu, Ali |
| Music | Ilayaraja |
| Singer(s) | S.P. Balasubrahmanyam, Vani Jayaram |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
ఆ హా హా ఆ ఆ, ఆ హా హాహా
ఆ హా హా ఆ ఆ, ఆ హా హా హా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై
ఎండలన్ని పూల జల్లులై
ముద్దుకే పొద్దుపొడిచే
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
ఓ ఓ ఓ, చుక్కా నవ్వవే
వేగుల చుక్కా నవ్వవే
కంటి కోలాటాల… జంట పేరంటాల
ఓ ఓ ఓ, చుక్కా నవ్వవే
నావకు చుక్కా నవ్వవే
పొందు ఆరాటాల… పొంగు పోరాటాల
మొగ్గ తుంచుకుంటే మొగమాటాలా
బుగ్గ దాచుకుంటే బులపాఠాలా
దప్పికంటే తీర్చడానికెన్ని తంటాలా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
ఓ ఓ ఓ, రామచిలకా చిక్కని ప్రేమమొలకా
గూడు ఏమందమ్మా… ఈడు ఏమందమ్మా
ఈడుకున్న గూడు నువ్వే గోరింకా
తోడుగుండి పోవే… కంటి నీరింకా
పువ్వునుంచి నవ్వును… తుంచ లేరులే ఇంకా
మిన్నేటి సూరీడు లలలాల
మిన్నేటి సూరీడు లలలాల లలలాల
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై
ఎండలన్ని పూల జల్లులై
ముద్దుకే పొద్దుపొడిచే
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
Minneti Suridu song is from the Seethakoka Chiluka movie.
Minneti Suridu song was sung by S.P. Balasubrahmanyam, Vani Jayaram.
Minneti Suridu song lyrics were written by Veturi Sundararama Murthy.
Minneti Suridu song music was composed by Ilayaraja.