
| Movie Name | |
|---|---|
| Director | Bairisetty Bhaskara Rao |
| Star Cast | Rajendra Prasad, Chandra Mohan, Ramya Krishna |
| Music | Ilayaraja |
| Singer(s) | K J Yesudas |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
మిడిసిపడే దీపాలివి… మిన్నెగసిపడే కెరటాలివి
మిడిసి పడే దీపాలివి.. మిన్నెగిసి పడే కెరటాలివి
వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు
వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు
ఈ జీవితమే… ఒక గమ్యం లేని నావ
సుఖదుఃఖాలే ఏకమైన రేవులో, ఓ ఓ ఓ
మిడిసి పడే దీపాలివి… మిన్నెగిసి పడే కెరటాలివి
వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు
వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు
బావి లోతు ఇంతని తెలుసు
నదుల లోతు కొంతే తెలుసు
ఆడ గుండె లోతు ఎంతో
లోకంలో ఎవరికి తెలుసు
ఏ నిమిషం ప్రేమిస్తుందో
ఏ నిమిషం పగబడుతుందో
ఎప్పుడెలా మారుతుందో
తెలిసిన మగవాడు లేడు
రాగం అనురాగం.. ఎర వేసి జత చేరి
కన్నీట ముంచుతుందిరా
మిడిసి పడే దీపాలివి… మిన్నెగిసి పడే కెరటాలివి
వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు
వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు
పాము విషం సోకినవాడు… ఆయువుంటె బతికేస్తాడు
కన్నె వలపు కరిచిన వాడు… నూరేళ్ళకి తేరుకోడు
సొగసు చూసి మనసిచ్చావా… బందీగా నిలబడతావు
నీ కలలే విరిగిననాడూ… కలతే నీ తోడవుతుంది
లేదు, ఏ సౌఖ్యం… రవ్వంత సంతోషం
ఈ ఆడదాని ప్రేమలో
మిడిసి పడే దీపాలివి… మిన్నెగిసి పడే కెరటాలివి
వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు
వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు
ఈ జీవితమే ఒక గమ్యం లేని నావ
సుఖదుఃఖాలే ఏకమైన రేవులో, ఓ ఓ
మిడిసి పడే దీపాలివి… మిన్నెగిసి పడే కెరటాలివి
వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు
వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు
Midisipade Deepalivi song is from the movie.
Midisipade Deepalivi song was sung by K J Yesudas.
Midisipade Deepalivi song lyrics were written by Veturi Sundararama Murthy.
Midisipade Deepalivi song music was composed by Ilayaraja.