
| Movie Name | |
|---|---|
| Director | N. Shankar |
| Star Cast | Venkatesh, Soundarya |
| Music | Vandemataram Srinivas |
| Singer(s) | Kumar Sanu, Swarnalatha |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
మెరిసేటి జాబిలి నువ్వే
కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే
ఓ మై ఓ మై లవ్
నను లవ్‌లో దించేశావ్
మనసైనవాడివి నువ్వే
ప్రియమైన తోడువి నువ్వే
నా కన్నుల కాంతివి నువ్వే
ఓ మై ఓ మై లవ్
నను మైమరిపించేశావ్
ఓ మై ఓ మై లవ్… టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్, ఏమిటంటుంది
ఏమేమి అడిగిందీ
ప్రేమ ఇమ్మంది… ప్రేమందుకొమ్మంది
మెరిసేటి జాబిలి నువ్వే
కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే
ఓ మై ఓ మై లవ్
నను లవ్‌లో దించేశావ్
అల్లుకో బంధమా…!
ఒంటరి అల్లరి తీరేలా… జతకానా జవరాలా
ఆదుకో ప్రణయమా..!
తుంటరి ఈడును ఈవేళ… ఓదార్చనా ప్రియురాలా
నా ఆశలన్నీ నీకోసమంటూ… నీ దారి చూడనీ
నా శ్వాసలోని రాగాలు అన్నీ… నీ పేరు పాడనీ
మసక చీకట్లలో… నా మనసు అందించనీ
ఓ మై ఓ మై లవ్… టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్, ఏమిటంటుంది
ఏమేమి అడిగిందీ
ప్రేమ ఇమ్మంది… ప్రేమందుకొమ్మంది
మనసైనవాడివి నువ్వే
ప్రియమైన తోడువి నువ్వే
నా కన్నుల కాంతివి నువ్వే
ఓ మై ఓ మై లవ్
నను మైమరిపించేశావ్
కలిసిరా అందమా..!
చుక్కల వీధిన విహరిద్దాం… స్వర్గాలను చూసొద్దాం
కరగవే సందేహమా..!
చక్కగ దొరికెను అవకాశం… సరదాగా తిరిగొద్దాం
నీ వాలు కనులు నాపైన వాలి… నను మేలుకొలపనీ
నీ వేలికొనన నా మేను తాకి వీణల్లే మీటనీ
వయసు వాకిళ్లలో… తొలివలపు వెలిగించనీ
ఓ మై ఓ మై లవ్… టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్, ఏమిటంటుంది
ఏమేమి అడిగిందీ
ప్రేమ ఇమ్మంది… ప్రేమందుకొమ్మంది
మెరిసేటి జాబిలి నువ్వే
కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే
ఓ మై ఓ మై లవ్
నను లవ్‌లో దించేశావ్
ఓ మై ఓ మై లవ్… టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్, ఏమిటంటుంది
ఏమేమి అడిగిందీ
లాలాలల్లల్లా లల లాలా లలల్లల్లా
Meriseti Jabilli Nuvve song is from the movie.
Meriseti Jabilli Nuvve song was sung by Kumar Sanu, Swarnalatha.
Meriseti Jabilli Nuvve song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Meriseti Jabilli Nuvve song music was composed by Vandemataram Srinivas.