Movie Name | Racharikam (2025) |
---|---|
Director | Suresh Lankalapalli |
Star Cast | Vijay Shankar |
Music | Vengi |
Singer(s) | Rahul Sipligunj, Kumara Vagdevi |
Lyricist | 'Saraswati Putra' Ramajogayya Sastry |
Music Label | Aditya Music |
మౌలా మౌలా మౌలా
మౌలా మేరె మౌలా
దువ దే మేరె మౌలా
మౌలా మౌలా మౌలా
మౌలా మేరె మౌలా
దువ దే మేరె మౌలా
చూడముచ్చటైన అందాల జంట మౌలా
ఆశీర్వదించు మౌలా
రారాజులా ముందు నువ్వు
నీ రాణిలా వెంట నేను
ఇలాంటి ఓ రోజు నేను
ఊహించలేదే ఊహాలోను
ఇన్నేళ్ల నీ కల తీరేనా
సంక్రాంతిగా తెల్లవారేనా
నమ్మేదెలా ఇది నేనేనా
సరి కొత్త కాంతి చేరుకుంది నాలోన
మౌలా మౌలా మౌలా
మౌలా మేరె మౌలా
దువ దే మేరె మౌలా
చూడముచ్చటైన అందాల జంట మౌలా
ఆశీర్వదించు మౌలా
రివ్వన్నావే నీ నవ్వు గువ్వలు జంటలు జంటలుగా
ఘల్లాన్నావే నీ కాలి మువ్వలు కోవెల గంటలుగా
రెండు జెల్లా లంగరేసి కాలాన్ని ఇచ్చటే ఆపనా
రెండు కళ్ళ వంతెనేసి లోకాన్ని నీలా చూడనా
చెలినిగా జత సాగనా నీ ముద్దు ముద్దు ముచ్చటంత తీర్చలేనా
వెలుగునై నడిపించనా నిన్నల్లుకున్న కంచెలన్నీ తెంచలేనా
ఈ నమ్మకాలు చాలు నా ప్రేమ బాటనా
నా తురుపెక్కడంటే నువ్వెక్కడుంటే అక్కడంటూ చాటి చెప్పనా
మౌలా మౌలా మౌలా
మౌలా మేరె మౌలా
దువ దే మేరె మౌలా
చూడముచ్చటైన అందాల జంట మౌలా
ఆశీర్వదించు మౌలా
ఆకాశమే అరచేత వాలెను నీ జత చేరగనే
భూగోళమే జళ్ళో పూబంతిగా మారెను నీ వలెనే
వాన విల్లు వర్ణమంతా లేలేత పెదవికి కానుక
నిన్నలోని చీకటంతా మీనల కన్నులోని కాటుక
ఎవరు నువ్వని అడగనా నేనేంటే నీకు ఎందుకింత మనసనీ
జత పడే ప్రతి అడుగున వెన్నంటే ప్రేమ నిన్ను నన్ను నడపని
హే ప్రాణబంధమేదో నన్నల్లుకున్నదే
నా గుండె సందడంతా నీ అందమైన పేరులాగా మోగుతున్నదే
మౌలా మౌలా మౌలా
మౌలా మేరె మౌలా
దువ దే మేరె మౌలా
చూడముచ్చటైన అందాల జంట మౌలా
ఆశీర్వదించు మౌలా