
| Movie Name | Captain (2022) |
|---|---|
| Director | Shakti Soundar Rajan |
| Star Cast | Arya, Aishwarya Lekshmi, Kavya Shetty, Simran |
| Music | D Imman |
| Singer(s) | Yazin Nizar |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | Think Music India |
Maturame Lyrics in Telugu
జ్ఞాపకం ప్రతి జ్ఞాపకం
మధురమే ప్రతి జ్ఞాపకం, ఓ ఓ
ఎదుటపడని నిమిషాలన్నీ
తెరవిడవని పొడుపు కధలే
ఎదుటపడిన మరునిమిషంలో
అవి జ్ఞాపకాల నిధులే
తెలిసేదాకా తెలియదుగా
ఏ నిమిషంలో మరి ఏముందో
కలిసిన కమ్మని జ్ఞాపకమై
అది ఎటువైపు మాయం అవుతుందో
జ్ఞాపకం ప్రతి జ్ఞాపకం
మధురమే ప్రతి జ్ఞాపకం, హో ఓ
పదిలమే ప్రతి జ్ఞాపకం
చెరగదే తన సంతకం హో ఓ ఓ
అపుడో ఇపుడో… చిరు అలజడిగా
ఏ కలత ఎదురుపడినా, హో ఓ
తలను వంచనని తలపడితే
మరుక్షణము విజయమేగా
జ్ఞాపకం ప్రతి జ్ఞాపకం
మధురమే ప్రతి జ్ఞాపకం
హో ఓ ఓ ఓ టెన్ టు ఫైవ్
ప్రతి ఒక మనిషితో
ప్రతి ఒక మనసుతో
ఎన్నో జ్ఞాపకాలు
ఎన్నెన్నో వేలు వేలు
తలపును కదుపుతు
నిదురను కుదుపుతు
వచ్చి వెళ్ళిపోయే
వందేళ్ళ చందనాలు
పొలమారితే మనసున వాలే
సీతా చిలుకలు కొన్ని
చేయి జారుతూ జలజల రాలేటి
దివి తారలు ఇంకొన్ని
ముగిసిన కథలను బతికించే
సంజీవని జ్ఞాపకమే
జ్ఞాపకం ప్రతి జ్ఞాపకం, హో ఓ
మధురమే ప్రతి జ్ఞాపకం, ఓ ఓ ఓ
అడుగు అడుగు ఒక అనుభవమే
మన బ్రతుకు దారి పొడవు
గతము వెలుగు మన తోడుంటే
ఇక గురుతురాదు బరువు
రాతిరి నలుపున రత్నంలాగా
మెరిసే గురుతులు ఎన్నెన్నో
చెంపలు తడిమిన ముత్యంలాగ
కన్నీరై జారేవింకెన్నో
జ్ఞాపకం ప్రతి జ్ఞాపకం హో ఓ
మధురమే ప్రతి జ్ఞాపకం ఓ ఓ
జ్ఞాపకం ప్రతి జ్ఞాపకం హో ఓ
పదిలమే ప్రతి జ్ఞాపకం
Maturame song is from the Captain movie.
Maturame song was sung by Yazin Nizar.
Maturame song lyrics were written by Ramajogayya Sastry.
Maturame song music was composed by D Imman.