
| Movie Name | Saamanyudu |
|---|---|
| Director | Thu.Pa.Saravanan |
| Star Cast | Vishal, Dimple Hayathi |
| Music | Yuvan Shankar Raja |
| Singer(s) | Yuvan Shankar Raja |
| Lyricist | Shree Mani |
| Music Label | VishalFilmFactory |
మత్తెక్కించే కళ్ళే
పిచ్చెక్కించే చూపే
నిముషాల్లో కైపెక్కించే నైజం నీదే
కత్తుల్లేని యుద్ధం
ప్రాణం తీసే అందం
సొగసే నీ ఆయుధమైతే
నేనేం చెయ్యాలి
నీతో అడుగే పడితే
నాలో ఒంటరితనమొక సెలవే
ఓ ప్రేమ ప్రపంచం నిర్మించి
కల నిజమే చేద్దాం పదవే
కనుసైగ తోటి పిలుపివ్వు చాలే
భూలోకమంతా గెలిచేస్తాలే
నా చెయ్యి పట్టి అందించు చాలే
ఈ లోకమంతా ఏలేస్తాలే
ఉదయాన్నే హాయిగా
ఒళ్ళో ఉన్న నిన్నే చూసి
నమ్మేలా లేదని
నన్నే నిన్ను గిల్లుకుని
ఎటు పక్క నేనున్నా
నాతో నిన్నే పక్కన చూసి
ఏం చక్కని జంటని చెప్పి
లోకం కుళ్ళి చావని
ప్రాణం విడువని జతగా
మన ప్రేమ ప్రయాణం మొదలవ్వని
కాలం మరువని కధగా
మన ప్రేమని చరితే చదివేయ్ని
నీ బుగ్గల్లోని సిగ్గే
చీకట్లో వెన్నెల
అది అడిగే తీయని ముద్దే
నా పెదవికి వెన్నెల
కనుసైగతోటి పిలుపివ్వు చాలే
భూలోకమంతా గెలిచేస్తాలే
నా చెయ్యి పట్టి అందించు చాలే
ఈ లోకమంతా ఏలేస్తాలే
మత్తెక్కించే కళ్ళే
పిచ్చెక్కించే చూపే
నిముషాల్లో కైపెక్కించే నైజం నీదే
కత్తుల్లేని యుద్ధం
ప్రాణం తీసే అందం
సొగసే నీ ఆయుధమైతే
ఏం చెయ్యాలి
Matthikinche Kalle song is from the Saamanyudu movie.
Matthikinche Kalle song was sung by Yuvan Shankar Raja.
Matthikinche Kalle song lyrics were written by Shree Mani.
Matthikinche Kalle song music was composed by Yuvan Shankar Raja.