Marumalli Jabilli Song Lyrics - Lakshmi Narasimha

Marumalli Jabilli Song Lyrics - Lakshmi Narasimha
Marumalli Jabilli Song Lyrics: Marumalli Jabilli is a Telugu song from the film Lakshmi Narasimha starring Nandamuri Balakrishna, Asin, directed by Jayanth C. Paranji. "Marumalli Jabilli" song was composed by Mani Sharma and sung by Shankar Mahadevan, Muralidhar & Sri Vardhini. Lyrics were written by Chandra Bose.

Marumalli Jabilli Song Details

Movie NameLakshmi Narasimha (2004)
DirectorJayanth C. Paranji
Star CastNandamuri Balakrishna, Asin
MusicMani Sharma
Singer(s)Shankar Mahadevan, Muralidhar & Sri Vardhini
LyricistChandra Bose
Music LabelAditya Music

Marumalli Jabilli Song Lyrics in Telugu

మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి

మన్మధుని రాఘవుని కలబోతే బావ అని

ఎయ్, మరుమల్లి జాబిల్లి

ఒకటైతే మా చెల్లి

మన్మధుని రాఘవుని

కలబోతే బావ అని

ఇద్దరొక్కటయ్యే పెళ్ళి

ఈడు జోడు పెళ్ళి

ఇంటిపేరు మార్చే పెళ్ళి

జంటనడక పెళ్ళి

బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవమై

జరుగుతున్న పెళ్ళి

బహుమానంగా ఆశీస్సులనే

అడుగుతున్న పెళ్ళి

మరుమల్లి జాబిల్లి

ఒకటైతే మా చెల్లి

ఇద్దరొక్కటయ్యే పెళ్ళి

ఈడు జోడు పెళ్ళి

ఇంటిపేరు మార్చే పెళ్ళి

జంటనడక పెళ్ళి

దేవుళ్ళు దేవతలు

కొలువై లేరు కోవెలలో

బంధువులై చుట్టాలై

విచ్చేసినారు వాకిలిలో

ఊరు వాడా వేడుకా

ప్రతి ఒక్కరి హృదయం వేదిక

లేనే లేదు తీరికా

ప్రతి నిమిషం తెలియని తికమకా

మైనాలు కోయిలలు

కూర్చోలేదు కొమ్మలలో

మా వాళ్ళై అయినోళ్ళై

ఒక చెయ్యేసినాయి మేళంలో

పందిరిలోన పండుగలన్ని

నిలుపుతున్న పెళ్ళి

నవ్వులలోన కన్నుల తడిని

కలుపుతున్న పెళ్ళి

మరుమల్లి జాబిల్లి

ఒకటైతే మా చెల్లి

ఇద్దరొక్కటయ్యే పెళ్ళి

ఈడు జోడు పెళ్ళి

ఇంటిపేరు మార్చే పెళ్ళి

జంటనడక పెళ్ళి, హేయ్

మా నాన్నా మా అన్న

ఇద్దరు నాకు పుట్టిళ్ళు

అందరికి సెలవంటు

నేవెళ్ళి వస్తా అత్తిళ్ళు

చల్లని చూపే కాటుకా

ఇక చెరగని ప్రేమే బొట్టుగా

మమకారాలే సిరులుగా

మెట్టింట్లో ఉంటా సీతగా

ఆత్రాన్నై సూత్రాన్నై

ముద్దుగా వేస్తా బంధాలు

నేస్తాన్నై నీ వాడ్నై

నీ వద్ద ఉంటా వందేళ్ళు

మాటలు కలిసే మనసులు కలిసే

ముచ్చటైన పెళ్ళి

కలిసిన మనసే సాక్షిగా నిలిచే

స్వచ్చమైన పెళ్ళి

మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి

మన్మధుని రాఘవుని కలబోతే బావ అని

ఎయ్, మరుమల్లి జాబిల్లి… ఒకటైతే మా చెల్లి

మన్మధుని రాఘవుని… కలబోతే బావ అని

ఇద్దరొక్కటయ్యే పెళ్ళి… ఈడు జోడు పెళ్ళి

ఇంటిపేరు మార్చే పెళ్ళి… జంటనడక పెళ్ళి

ఇద్దరొక్కటయ్యే పెళ్ళి… ఈడు జోడు పెళ్ళి

ఇంటిపేరు మార్చే పెళ్ళి… జంటనడక పెళ్ళి

Listen this Song in Online!

Share this Song!

More Songs from Lakshmi Narasimha Movie

  1. Marumalli Jabilli Song Lyrics

Marumalli Jabilli Song FAQ

What movie is Marumalli Jabilli song from?

Marumalli Jabilli song is from the Lakshmi Narasimha movie.

Who sang Marumalli Jabilli song?

Marumalli Jabilli song was sung by Shankar Mahadevan, Muralidhar & Sri Vardhini.

Who wrote Marumalli Jabilli song lyrics?

Marumalli Jabilli song lyrics were written by Chandra Bose.

Who composed music for Marumalli Jabilli song?

Marumalli Jabilli song music was composed by Mani Sharma.