| Movie Name | |
|---|---|
| Director | V. Madhusudan Rao |
| Star Cast | Sobhan Babu, Lakshmi, Jayasudha |
| Music | Chakravarthy |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Aarudra |
| Music Label | Saregama Music |
చేయి జారిన మణిపూస చెలియ నీవు
తిరిగి కంటికి కనబడితీవుగాని
చూపు చూపున తొలినాటి శోకవన్నె రేపుచున్నావు
ఎంతటి శాపమే..!!
ఓఓ ఓ ప్రియా
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మరు మల్లియకన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది
సఖియా, ఆ ఆఆ
నీవెంతటి వంచన చేశావు
సిరిసంపదకమ్ముడు పోయావు
నీవెంతటి వంచన చేశావు
సిరిసంపదకమ్ముడు పోయావు
విడనాడుట నీకు సులభం
విడనాడుట నీకు సులభం
నిను విడువదులే నా హృదయం
ఓ ఓ ఓ ప్రియా
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
చెలి చేసిన గాయం మానదులే, ఏ ఏ ఏ
చెలి చేసిన గాయం మానదులే
చెలరేగే జ్వాల ఆరదులే…
ఓఓ ఓ ప్రియా
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది
ఓఓ ఓ ప్రియా, ఆ ఆ…
Maru Malliya Kanna song is from the movie.
Maru Malliya Kanna song was sung by S P Balasubramanyam.
Maru Malliya Kanna song lyrics were written by Aarudra.
Maru Malliya Kanna song music was composed by Chakravarthy.