Manninchu O Prema Song Lyrics - Ela Cheppanu Cinema

Manninchu O Prema Song Lyrics - Ela Cheppanu Cinema
Manninchu O Prema Song Lyrics: Manninchu O Prema is a Telugu song from the film Ela Cheppanu Cinema starring Tarun, Shreya, directed by Ramana B V. "Manninchu O Prema" song was composed by Koti and sung by Udit Narayan & Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Manninchu O Prema Song Details

Movie NameEla Cheppanu Cinema
DirectorRamana B V
Star CastTarun, Shreya
MusicKoti
Singer(s)Udit Narayan & Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Manninchu O Prema Song Lyrics in Telugu

ఓ ప్రేమా… ప్రేమా ప్రేమా

మన్నించు ఓ ప్రేమ… మురిపించుకోకమ్మా

మౌనాలు కరిగించేలా మాటాడుమా

మన్నించు ఓ ప్రేమా… మరుగేల చెప్పమ్మా

దరిచేరు దారేదైనా చూపించుమా

చెప్పనంటు దాచడానికైనా

అంత చెప్పరాని మాట కాదు ఔనా

ఇంత మంచి వేళ ఎదురైనా

మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనా

పట్టరాని ఆశ పెంచుకున్నా

అది మోయరాని భారమవుతున్నా

చెప్పుకుంటే తప్పు లేదు అయినా

నువ్వు ఒప్పుకోవో ఏమో అనుకున్న

ఓ ప్రేమా… ప్రేమా ప్రేమా

మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా

మౌనాలు కరిగించేలా మాటాడుమా

జంట కమ్మని, వెంట రమ్మని… పిలిచే నేస్తమా

కొంత చేరువై, కొంత దూరమై… ఉంటే న్యాయమా

రెండు చేతులా అందుకోమని… అనవేం స్నేహమా

చెంత నిలిచినా చేయి కలపవేం… నాదే నేరమా

చొరవగా పొదువుకో… నడిపే ప్రణయమా

బిడియమే వదులుకో… బెదిరే ప్రియతమా

తగిన తరుణమని ఉదయ కిరణమై

ఎదురుపడిన వరమా

(హే హే హే హే హే హెహెహె

హే హే హే హే హే హెహెహె)

మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా

మౌనాలు కరిగించేలా మాటాడుమా

అన్నివైపులా చెలిమి కాపలా అల్లే బంధమా

మబ్బులో అలా దాగితే ఎలా… దిగిరా చంద్రమా

నిదురలో అలా నిలిచిపోకలా… మెరిసే స్వప్నమా

కంటిపాపలో కబురులేమిటో… చెబితే పాపమా

తలపునే తెలుపవే… నాలో ప్రాణమా

పెదవిపై పలకవే… ఊహా గానమా

మదిని మీటినది నీవు కాదా

మరి మధురమైన స్వరమా

మన్నించు ఓ ప్రేమా… మురిపించుకోకమ్మా

మౌనాలు కరిగించేలా మాటాడుమా

చెప్పనంటు దాచడానికైనా

అంత చెప్పరాని మాట కాదు ఔనా

ఇంత మంచి వేళ ఎదురైనా

మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనా

ఓ ప్రేమా ప్రేమా ప్రేమా

ఓ ప్రేమా ప్రేమా ప్రేమా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ela Cheppanu Cinema Movie

  1. Manninchu O Prema Song Lyrics

Manninchu O Prema Song FAQ

What movie is Manninchu O Prema song from?

Manninchu O Prema song is from the Ela Cheppanu Cinema movie.

Who sang Manninchu O Prema song?

Manninchu O Prema song was sung by Udit Narayan & Chitra.

Who wrote Manninchu O Prema song lyrics?

Manninchu O Prema song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Manninchu O Prema song?

Manninchu O Prema song music was composed by Koti.