| Movie Name | Mangli Official (2022) (2025) |
|---|---|
| Director | Damu Reddy |
| Star Cast | Mangli & Indravathi Chouhan |
| Music | Prashanth Vihari |
| Singer(s) | Mangli & Indravathi Chouhan |
| Lyricist | Kasarla Shyam |
| Music Label |
Mangli Radhe Krishna Radhe Song Lyrics in Telugu
హరే కృష్ణా రాధాలోలా హరే..
బృందావనంలోన కన్నయ్యా
రాధా మనంలోన నీవయ్యా
నీవే లేని చోటే లేదయా
రాధా నీవై కొలువున్నావయా
చంద్రోదయంలోన కృష్ణయ్యా
రాధే రాధే జపం వినవయ్యా
రాధే కృష్ణా రాధే….
హరే కృష్ణా హరే …….
………
……….
రాధే రాధే రాధే నామ్ పుకారే
ప్రేమ్ కీ హర్ గలీ మే
వ్రజ్ కీ హర్ గలీ మే
గూంజే నామ్ రాధే శ్యామ్ రే
రాధే రాధే నామ్ పుకారే
వెన్నెల మోస్తున్న యమునా తీరం
కన్నుల చూస్తున్నా గీతాసారం
జగమే నీవనే నమ్మిన వేదము
జనమే నీకై సాగిన మార్గము
జగమంతా నిండిన నీ కీర్తీ
మనసారా హాయిగా నే పాడనీ
చిటికిన వేలున బరువును మోసిన
గోవర్ధన గిరిధారివే కన్నయ్యా
మా భారం ఇక నీదేగా రాధా కృష్ణయ్యా
రాధే కృష్ణా రాధే……
హరే కృష్ణా హరే …….
మధురలో మధురంగా చూపిన లీల
ఎదురుగా కంటున్నా ఓ గోపాలా
దాగుడు మూతలు ఆడిన వేళలా
వేణువు తానై మ్రోగిన రాధలా
నీ ప్రేమే అఖిలం ఓ మాధవా
ఆ చరితం సుందరం ఓ కేశవా
తనువును మనసును నీకై దాచిన
గోపికనైనా చాలయ్యా చిన్నీ కృష్ణయ్యా
చిన్ని జన్మే ధన్యం అవ్వదా రాధా కృష్ణయ్యా
రాధే కృష్ణా రాధే….
హరే కృష్ణా హరే …….
……..