| Movie Name | & - Kasarla Shyam |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Madeen SK |
| Singer(s) | Mangli, Kasarla Shyam & Master Likith |
| Lyricist | Kasarla Shyam |
| Music Label | Mangli Official |
పైస పోతే పోనీ గాని… పాణం ఉంటె సాలన్నా…
బలుసాకైనా తిందాం కానీ… బతికి ఉంటే సాలన్నా…
పైస పోతే పోనీ గాని… పాణం ఉంటె సాలన్నా…
బలుసాకైనా తిందాం కానీ… బతికి ఉంటే సాలన్నా…
ఊపిరుంటే సాలోరన్నా… ఉప్పు అమ్ముకొని జీవిద్దాం…
మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా… మనిషి లేకపోతే ఏమి లాభము…
కండపోయే గడియలొచ్చే వరకు…
వీడొద్దురన్నా గుండె ధైర్యము…
తరరారే రారేరారారో… తరరారే రారో తరరారే రారేరారారో.. ఓ ఓ
తరరారే రారేరారారో… తరరారే రారో తరరారే రారేరారారో…
పైస పోతే పోనీ గాని… పాణం ఉంటె సాలన్నా…
బలుసాకైనా తిందాం కానీ… బతికి ఉంటే సాలన్నా…
అల్లా.. ఏసు.. ఎంకటేశుడు… మసీదు.. చర్చి.. గుల్లే నుండి…
గడపనైనా దాటలేక … ఘంటశిలలై పోయిన వేళ…
ఏ తల్లి కన్నబిడ్డలో కాని…. ఎములోడికే వీళ్లు అడ్డం నిలిచి
వాళ్ళ ప్రాణాలను అడ్డు ఏసి… మన ప్రాణాలను కాపాడుతుండ్రు…
కంటికి కూడా కనిపించకుండా… కాటు వేస్తున్న రక్కసి నుండి
కంటి మీద కునుకు లేక… కంచె వేసి మరీ కాపు కాస్తుండ్రు…
మనకోసం పుట్టిన దేవుళ్ళు వీళ్ళు…
వాళ్ళు చెప్పిన మాటింటే సాలు…
తరరారే రారేరారారో… తరరారే రారో తరరారే రారేరారారో.. ఓ ఓ
తరరారే రారేరారారో… తరరారే రారో తరరారే రారేరారారో…
పైస పోతే పోనీ గాని… పాణం ఉంటె సాలన్నా…
బలుసాకైనా తిందాం కానీ… బతికి ఉంటే సాలన్నా…
ఒక్క నువ్వు శుభ్రంగుంటే ఇల్లు ఇల్లంతా సక్కగుంటది
ఒక్కొక్క ఇల్లు సక్కగుంటే వాడ కట్టంతా మంచిగుంటది…
వాడ కట్టంతా మంచిగుంటే… ఊరు ఊరంతా బాగుంటదన్నా…
ఊరు బాగుంటే… జిల్లా రాష్ట్రం దేశం మొత్తం సల్లగుంటది…
పదిమందికి సాయ పడకపోయినా… చెడు చేయకుండా ఉంటె సాలన్నా
మంచి మాట నువ్వు సెప్పకున్నా… కట్టుకథలను మోయొద్దన్నా…
కన్నతల్లి లాంటి సర్కారున్నది…
కడుపుల పెట్టి సాదుకుంటది…
తరరారే రారేరారారో… తరరారే రారో తరరారే రారేరారారో.. ఓ ఓ
తరరారే రారేరారారో… తరరారే రారో తరరారే రారేరారారో…
పైస పోతే పోనీ గాని… పాణం ఉంటె సాలన్నా…
బలుసాకైనా తిందాం కానీ… బతికి ఉంటే సాలన్నా…
మన పుట్టుకలోనే ఉన్నదిరన్నా కొట్లాడే గుణము…
నాడు గత్తరొస్తే సంపి… నెత్తిన ఎత్తినాము బోనం…
మన బతుకులోనే దాగున్నదన్నా… తండ్లాడే గుణము…
నేడు కొత్తగొచ్చిన… కొమ్ముల పురుగుకు పెడదాము దినము…
—- మల్ల ఎత్తుదాము బోనము—-
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Mangli Corona song is from the & - Kasarla Shyam movie.
Mangli Corona song was sung by Mangli, Kasarla Shyam & Master Likith.
Mangli Corona song lyrics were written by Kasarla Shyam.
Mangli Corona song music was composed by Madeen SK.