
| Movie Name | 2023, Rohini (2023) |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Madeen SK |
| Singer(s) | Rohini & Hanumanth Yadav |
| Lyricist | Kamal Eslavath |
| Music Label |
మంచు పల్లకి మోసుకొచ్చే ఇళ్ళకి
నింగి సింగిడిలో రంగులన్ని రంగవల్లికి
రేగుపళ్లకి గోవు గొబ్బెమ్మలకీ
పూలపాన్పు సహిత స్వాగతాలు పల్లెటూళ్లకి
చెల్లి చేత చుక్కలల్లి ముగ్గులేయగ
నేలతల్లి తరచి మురిసి ముగ్దురాలవ్వగ
ఉత్తరాన కొత్తగ సూరీడు ప్రకాశించగా
భోగిమంట మొదలు… పిండివంట రుచులు
వేడుకలై సాగే… సంక్రాంతి సంబరాల
పాడి పంట చేలు… ఇంటింట నిండే సిరులు
పశుపక్ష్యాదుల కొలిచే.. కనుమ ఉత్సవాలు
మంచు పల్లకి మోసుకొచ్చే ఇళ్ళకి
నింగి సింగిడిలో రంగులన్ని రంగవల్లికి, (రంగవల్లికి)
రేగుపళ్లకి గోవు గొబ్బెమ్మలకీ
పూలపాన్పు సహిత స్వాగతాలు పల్లెటూళ్లకి, (పల్లెటూళ్లకి)
పౌరుషాల కోడిపుంజు పందేమాడగ
పొగరు జూపే జొడెద్దు పరుగుపోటి గెలవగ
ఆనందమనే దారము ఆధారమవ్వగ
గగన వీధుల విహరించే… మనసు పతంగములుగ
తిరిగి ఒడిని చేరే… జనుల కళ్ళజూడగ
పల్లెతల్లి యతలు మరిసి… ఆడేను దండిగా
ఏ అరమరికలు లేని తెలుగుజాతి పెద్దపండుగ
హరిదాసుల గానం… తంబూరల నాదం
డూ డూ బసవన్నందించే ఆశీర్వాదం
తైలపు తలస్నానం… నియమాలుపవాసం
చీకట్లను వెలివేసే… మకర జ్యోతి దర్శనం
మంచు పల్లకి మోసుకొచ్చే ఇళ్ళకి
నింగి సింగిడిలో రంగులన్ని రంగవల్లికి, (రంగవల్లికీ)
రేగుపళ్లకి గోవు గొబ్బెమ్మలకీ
పూలపాన్పు సహిత స్వాగతాలు పల్లెటూళ్లకి, (పల్లెటూళ్లకీ)
కోత మరిచి మళ్లీ పూతవట్టే పొలాలు
అరిగోస యాదిమరిసే… సంతసాన రైతులు
ఏకతాటిపైన నడిచే పల్లె గడపలు
కలహాలు వీడి… కలిసిపోయే మట్టి మనుషులు
పిల్లలు పెద్దలతో… ఇల్లంతా సందడి
ఎల్లలుదాటిన ప్రేమకు… ఏటేటా కూడలి
మన సంస్కృతికి ఆనవాలు.. సంక్రాంతి ఒరవడి
ప్రాంతాలేవైనా పంథాలెన్నున్నా
ఐకమత్యమును చాటే… మేటి పండగే ఇది
షావుకారు కైన… కడు శ్రమజీవుల పైన
శ్రీ లక్ష్మీ దీవెన అందించే తరుణమే ఇది
మంచు పల్లకి మోసుకొచ్చే ఇళ్ళకి
నింగి సింగిడిలో రంగులన్ని రంగవల్లికి, (రంగవల్లికీ)
రేగుపళ్లకి గోవు గొబ్బెమ్మలకీ
పూలపాన్పు సహిత స్వాగతాలు పల్లెటూళ్లకి, (పల్లెటూళ్లకీ)
Manchu Pallaki Sankranthi song is from the 2023, Rohini movie.
Manchu Pallaki Sankranthi song was sung by Rohini & Hanumanth Yadav.
Manchu Pallaki Sankranthi song lyrics were written by Kamal Eslavath.
Manchu Pallaki Sankranthi song music was composed by Madeen SK.