
| Movie Name | Srikaram (1996) |
|---|---|
| Director | C. Uma Maheswara Rao |
| Star Cast | Jagapathi Babu, Heera, Meghana |
| Music | Ilayaraja |
| Singer(s) | K J Yesudas |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు
కనుల నీరు తుడుచువారు
ఎవరు లేరని చితి ఒడికి చేరకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి
నూరేళ్ళు నిండుగా జీవించమన్నది
వేటాడు వేళతో పోరాడమన్నది
మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని… మరణాన్ని అడగకు
కలసిరాని కాలమెంత కాటేస్తున్నా
చలి చిదిమేస్తున్నా
కూలిపోదు వేరుఉన్న తరువేదైనా
తనువే మోడైనా
మాను జన్మకన్నా
మనిషి ఎంత మిన్న
ఊపిరిని పోసే ఆడదానివమ్మా
బేలవై నువ్వు కూలితే
నేలపై ప్రాణం ఉండదమ్మా
మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని… మరణాన్ని అడగకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి
నూరేళ్ళు నిండుగా జీవించమన్నది
వేటాడు వేళతో పోరాడమన్నది
మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని… మరణాన్ని అడగకు
ఆయువంతా ఆయుధముగా
మార్చవే నేడు పరిమార్చవే కీడు
కాళివైతే కాలి కింద అణుగును చూడు
నిను అణిచేవాడు
మృత్యువు మించే హాని ఎక్కడుంది
ఎంత గాయమైన మాని తీరుతుంది
అందుకే పద ముందుకే
లోకమే రాదా నీ వెనకే
మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు
కనుల నీరు తుడుచువారు
ఎవరు లేరని చితి ఒడికి చేరకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి
నూరేళ్ళు నిండుగా జీవించమన్నది
వేటాడు వేళతో పోరాడమన్నది
మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని… మరణాన్ని అడగకు
Manasu Kastha Kalatha song is from the Srikaram movie.
Manasu Kastha Kalatha song was sung by K J Yesudas.
Manasu Kastha Kalatha song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Manasu Kastha Kalatha song music was composed by Ilayaraja.