
| Movie Name | & English - Mamidi Mounika, Sv |
|---|---|
| Director | Narasimhan Elamadri |
| Star Cast | |
| Music | Sv Mallikteja |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label | MV MUSIC & MOVIES |
నీ నవ్వే నా పాణామంటివి… నువ్వు లేక ఉండానంటివి
నిన్నిడిసి బతకానంటివి… నన్నొదిలి ఉండాకంటివీ…
నా ప్రేమనెట్లా…
నా ప్రేమనెట్ల మర్సినావురో మనసిచ్చినోడా…
నన్నొదిలెట్లా పోయినావురో ఓరి సచ్చినోడా…
నా ప్రేమనెట్ల మర్సినావురో మనసిచ్చినోడా…
నన్నొదిలెట్లా పోయినావురో ఓరి సచ్చినోడా…
నీ గుండెల గుడికట్టిన్నంటివి… గుడిలోనా దేవతనంటివి
నా ప్రేమకి దాసుడనంటివి… పాణానికి పాణమంటివీ…
ఆ గుడి తలుపులు…
ఆ గుడి తలుపులు ఎట్ల మూస్తివిరో… నన్ను మరువానోడా
తడి గుండెల మంటెట్ల పెడితివిరో నన్నిడవానోడా…
ఆ గుడి తలుపులు ఎట్ల మూస్తివిరో… నన్ను మరువానోడా… ఆ ఆ
తడి గుండెల మంటెట్ల పెడితివిరో నన్నిడవానోడా…
నీ కంటీపాపనంటివి… సంటిపాప లెక్క సూసుకుంటివి
నీ ఇంటి దీపాన్నంటివి… కంట నీరే రానియ్యనంటివీ…
సంటి పాపనెట్ల…
సంటి పాపనెట్ల కసురుకుంటివో… నా సక్కానోడ
ఇంటి దీపాన్నేట్ల ఆర్పుతున్నవురో… నా శందూరూడ…
సంటి పాపనెట్ల కసురుకుంటివో… నా సక్కానోడ… ఆ ఆ
ఇంటి దీపాన్నేట్ల ఆర్పుతున్నవురో… నా శందూరూడ…
ఈడు జోడు కలిసేనాని… ఇద్దరమొక్కటి అయిదామని
ఇగురంగా నువ్వు నేను ఇట్లనే కలిసుందామంటివీ…
ఒక్కటవ్వుడు…
నీ ఒక్కటవ్వుడేమోగానీరో… నీ తోడే లేదు
నన్నొక్కాదాన్ని జేసినావురో… నేనేడాబోదు…
నీ ఒక్కటవ్వుడేమోగానీరో… నీ తోడే లేదు… ఊఉ
నన్నొక్కాదాన్ని జేసినావురో… నేనేడాబోదు…
సింగా సింగ దునికి గుండె… బెంగటిల్లీ పోయింది
సెంతా నువ్వు లేవని… సిన్నబోయి కూసుంది… ఈ ఈ
దేవదాసుని…
ఆ దేవదాసుని సూసినావేమో… ఈ ప్రేమలల్ల
కొత్తగ దేవదాసిని జేసినావురో… నీ బాసలల్ల
నన్ను ఏడిపించి ఎల్లీ పోకురో నా నోముల పంట
నీ ఎంటా నన్ను తోలుకుపోరో… నూరేళ్ళ జంట
Manasichinoda Folk song is from the & English - Mamidi Mounika, Sv movie.
Manasichinoda Folk song music was composed by Sv Mallikteja.