
| Movie Name | |
|---|---|
| Director | Kaarthik Shankar |
| Star Cast | Kiran Abbavaram, Sanjana Anand |
| Music | Mani Sharma |
| Singer(s) | Sri Krishna & Ramya Behra |
| Lyricist | Bhaskara Bhatla |
| Music Label |
సీతాకోక దారి మరిచినాదో
అద్దం ముందర అందంగా వాలినాదో
పూల కొమ్మే పైట వేసినాదో
అల్లరి గాలి అది చూసి నిలిచినదో
మనసే చిలకలా… పలికే కిలకిలా
చుట్టూ బంధాలిలా అల్లుకున్నాకా
పట్టపగ్గాల్లేని ప్రేమే చూసాకా
చిందులేసే ప్రాణాన్ని ఆపేదెలాగా, ఆ ఆఆ
మనసే చిలకలా… పలికే కిలకిలా
మా బుజ్జి బంగారం… నువ్వేలే నా లోకం
నాన్నంటే నా నేస్తం… కనుకే నాకిష్టం
నీ నవ్వే కలకాలం… గురుతుండే బహుమానం
బాబాయి దీవెనకి… లేదే కొలమానం
అమ్మకి ముద్దుల మూటవే
నీ గారాబం నా సొంతమే
అచ్చం పుత్తడిబొమ్మవే
చిన్నమ్మకి పోటీ నేనేలే
ఇంటికి నువ్వే యువరాణి, ఏలుకోవమ్మా
ఏం కావాలో తెచ్చిస్తాం, కోరుకోవమ్మా
మనసే చిలకలా… పలికే కిలకిల
ఏడేడు వర్ణాల… హరివిల్లే మా ఇల్లు
పండగలు పబ్బాలు… రోజు సందళ్ళు
ఏకంగా దివి నుంచి… దిగిరావా స్వర్గాలు
ఏనాడు నట్టింట్లో జారవు కన్నీళ్ళు
మనసుకి మనసుకి మధ్యన
విడదీసే గోడలు లేవులే
అలకలు అపుడపుడొచ్చినా
అవి చప్పున కరిగే మేఘాలే
సంగీతంలో పలికించే కోటి రాగాలు
మా అనురాగం ముందు అవి కూనిరాగాలు
మనసే చిలకలా… పలికే కిలకిలా
చుట్టూ బంధాలిలా అల్లుకున్నాకా
పట్టపగ్గాల్లేని ప్రేమే చూసాకా
చిందులేసే ప్రాణాన్ని ఆపేదేలాగా
Manase song is from the movie.
Manase song was sung by Sri Krishna & Ramya Behra.
Manase song lyrics were written by Bhaskara Bhatla.
Manase song music was composed by Mani Sharma.