Manasa Thulli Padake Song Lyrics - Srivariki Premalekha

Manasa Thulli Padake Song Lyrics - Srivariki Premalekha
Manasa Thulli Padake Song Lyrics: Manasa Thulli Padake is a Telugu song from the film Srivariki Premalekha starring Naresh, Poornima, directed by Jandhyala. "Manasa Thulli Padake" song was composed by Ramesh Naidu and sung by S Janaki. Lyrics were written by Veturi Sundararama Murthy.

Manasa Thulli Padake Song Details

Movie NameSrivariki Premalekha
DirectorJandhyala
Star CastNaresh, Poornima
MusicRamesh Naidu
Singer(s)S Janaki
LyricistVeturi Sundararama Murthy
Music Label

Manasa Thulli Padake Song Lyrics in Telugu

మనసా తుళ్ళిపడకే… అతిగా ఆశపడకే

అతనికి నీవు నచ్చావొ లేదో

ఆ శుభఘడియా వచ్చేనొ రాదో

తొందరపడితే అలుసే మనసా, తెలుసా

మనసా తుళ్ళిపడకే… అతిగా ఆశపడకే

ఏమంత అందాలు కలవనీ

వస్తాడు నిన్ను వలచీ

ఏమంత సిరి ఉంది నీకనీ

మురిసేను నిన్ను తలచీ

చదువా, పదవా… ఏముంది నీకు

తళుకు, కులుకు… ఏదమ్మ నీకు

శ్రుతిమించకే నీవు మనసా

మనసా తుళ్ళిపడకే… అతిగా ఆశపడకే

అతనికి నీవు నచ్చావొ లేదో

ఆ శుభఘడియా… వచ్చేనొ రాదో

తొందరపడితే అలుసే మనసా

తెలుసా మనసా తుళ్ళిపడకే… అతిగా ఆశపడకే

ఏ నోము నోచావు నీవనీ

దొరికేను ఆ ప్రేమఫలమూ

ఏ దేవుడిస్తాడు నీకనీ

అరుదైన అంత వరమూ

మనసా వినవే మహ అందగాడు

తనుగా జతగా మనకందిరాడు

కలలాపవే కన్నె మనసా

మనసా తుళ్ళిపడకే… అతిగా ఆశపడకే

అతనికి నీవు… నచ్చావొ లేదో

ఆ శుభఘడియా… వచ్చేనొ రాదో

తొందరపడితే అలుసే మనసా, తెలుసా

మనసా తుళ్ళిపడకే… అతిగా ఆశపడకే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Srivariki Premalekha Movie

  1. Manasa Thulli Padake Song Lyrics
  2. Tolisaari Mimmalni Chusindi Modalu Song Lyrics

Manasa Thulli Padake Song FAQ

What movie is Manasa Thulli Padake song from?

Manasa Thulli Padake song is from the Srivariki Premalekha movie.

Who sang Manasa Thulli Padake song?

Manasa Thulli Padake song was sung by S Janaki.

Who wrote Manasa Thulli Padake song lyrics?

Manasa Thulli Padake song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Manasa Thulli Padake song?

Manasa Thulli Padake song music was composed by Ramesh Naidu.