
| Movie Name | Pilisthe Palukutha (1991) |
|---|---|
| Director | Kodi Ramakrishna |
| Star Cast | Akash, Shamita Shetty |
| Music | M M Keeravani |
| Singer(s) | KS Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
మనసా ఒట్టు మాటాడొద్దు
పెదవిగడప దాటి నువ్వు బయట పడొద్దు
వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచుతెరలు తెరచి ఎపుడు చూపించొద్దు
అతనెంతగా ప్రేమ పంచినా
ఆ ప్రేమయే వరాలిచ్చినా
అవి పొందలేనని నీ మూగబాధని
కరిగించనివ్వవే కంచెల హద్దు
మనసా ఒట్టు… మాటాడొద్దు
పెదవిగడప దాటి… నువ్వు బయట పడొద్దు
వెచ్చని ముద్దు… వెతికా గుర్తు
మంచుతెరలు తెరచి ఎపుడు చూపించొద్దు
అతనెంతగా ప్రేమ పంచినా
ఆ ప్రేమయే వరాలిచ్చినా
అవి పొందలేనని నీ మూగబాధని
కరిగించనివ్వవే కంచెల హద్దు
నీ కంటి చూపులోన… ఒదిగిపోయి నేను
నూరేళ్ల తీపి స్వప్నంలా… బతుకుతూనే ఉంటాను
పడమటింటి పడక మీద… మల్లెపూలు వేసీ
ప్రతి సంధ్యలోన ఎదురు చూస్తు ఉంటాను
ఎలా చెప్పను… ఎలా చెప్పను
మూడునాళ్ల నిజం నేనని
ఈ తియ్యని జ్ఞాపకాలని
మరుజన్మకె పంచి ఇవ్వనీ
ఆ రోజు కోసమే ప్రతి రోజు గడపని
క్షమించు నేస్తమా… వద్దన వద్దు
మనసా ఒట్టు మాటాడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయట పడొద్దు
వెంటాడకమ్మ ఎడారి ఎండమావినీ
తను ఇవ్వలేని అమృతాన్ని నీకు అందిమ్మనీ
కొలువుండకమ్మ సమాధి నీడ చాటునీ
చితిమంట చూసి కోవెలలలో… యజ్ఞవాటి అనుకొని
మంటలారనీ గుండె జ్వాలనీ
వెంట తరమకూ జంటకమ్మనీ
ఏ భాషలో నీకు చెప్పినా
ఏ భావమూ మూగబోయినా
నువ్వు పట్టువదలని విక్రమార్కుడై
నీ ప్రేమతొ నన్నే చంపేయొద్దు
మనసా ఒట్టు మాటాడొద్దు
పెదవిగడప దాటి నువ్వు బయట పడొద్దు
వెచ్చని ముద్దు… వెతికా గుర్తు
మంచుతెరలు తెరచి ఎపుడు చూపించొద్దు
Manasa Ottu Matadoddu song is from the Pilisthe Palukutha movie.
Manasa Ottu Matadoddu song was sung by KS Chitra.
Manasa Ottu Matadoddu song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Manasa Ottu Matadoddu song music was composed by M M Keeravani.