
| Movie Name | Folk Song - 10 (2026) |
|---|---|
| Director | Shekar Virus |
| Star Cast | Vaishnavi Sony - Eshwar Sai |
| Music | Kalyan Keys |
| Singer(s) | Boddu Dilip Kumar |
| Lyricist | Gurram Sravan Kumar |
| Music Label | ANJANA MUSIC |
మల్లె చెట్టు కింద కూసున్న మనసైన ఓ ముద్దు గుమ్మా..
లంగావోణీ ఏసుకొని దొంగ చూపు చూసుకుంటా
నా మనసు దోచినావే బొమ్మ..
మల్లె చెట్టు కింద కూసున్న మనసైన ఓ ముద్దు గుమ్మా..
లంగావోణీ ఏసుకొని దొంగ చూపు చూసుకుంటా
నా మనసు దోచినావే బొమ్మ..
వాలుకళ్ళ సూపులతోని వలవేసినావే భామ
నా దిక్కు చూసుకుంటా నవ్వుకుంటా పోతాంటే
నా గుండె బరువెక్కేనమ్మా..
నేలవంక వచ్చిన నెలవంకనేమో.. కోయిలలో కోయిలమ్మలలో
ఆ స్వర్గసీమ నుండి దారితప్పి వచ్చెనో.. కోయిలలో కోయిలమ్మలలో
దివి నుండి నా కొరకే దిగి వచ్చెనేమో.. కోయిలలో కోయిలమ్మలలో
ఏ ఊరు నుండి మా ఊరికొచ్చెనో.. కోయిలలో కోయిలమ్మలలో
కలనో వరమో కలవరమేనో.. కోయిలలో కోయిలమ్మలలో
ఎనెన్ని జన్మల బంధం మనదో….
మల్లె చెట్టు కింద కూసున్న మనసైన ఓ ముద్దు గుమ్మా..
లంగావోణీ ఏసుకొని దొంగ చూపు చూసుకుంటా
నా మనసు దోచినావే బొమ్మ..
ఆ రంభ ఊర్వశి మేనకలైనా.. కోయిలలో కోయిలమ్మలలో
నీ అందము చూస్తే అసూయ పడతారే.. కోయిలలో కోయిలమ్మలలో
ఇంతటి అందాన్ని ఆ బ్రహ్మ దేవుడు.. కోయిలలో కోయిలమ్మలలో
ఎంతెంత కష్టపడి రూపుదిద్దినాడో.. కోయిలలో కోయిలమ్మలలో
దివిలోన నీవుంటే దేవుళ్ళు కూడా.. కోయిలలో కోయిలమ్మలలో
నిన్ను చూసి ఆగరాని కిందికే పంపేనేమో….
మల్లె చెట్టు కింద కూసున్న మనసైన ఓ ముద్దు గుమ్మా..
లంగావోణీ ఏసుకొని దొంగ చూపు చూసుకుంటా
నా మనసు దోచినావే బొమ్మ..
నింగిలోని సుక్కల్ని తెంపుకొని వచ్చి.. కోయిలలో కోయిలమ్మలలో
సుక్కలన్నీ కుప్పపోసి బొమ్మను చెక్కితే.. కోయిలలో కోయిలమ్మలలో
సక్కనైన నీ రూపు తయ్యారు అయ్యెనో.. కోయిలలో కోయిలమ్మలలో
ఏ ఇంద్రజాలము నీ ఇంత అందము.. కోయిలలో కోయిలమ్మలలో
నింగిలోని చంద్రుడే తొంగి చూసినాడో.. కోయిలలో కోయిలమ్మలలో
పారేటి యేరే నిన్ను చూసి ఆగెనో….
మల్లె చెట్టు కింద కూసున్న మనసైన ఓ ముద్దు గుమ్మా..
లంగావోణీ ఏసుకొని దొంగ చూపు చూసుకుంటా
నా మనసు దోచినావే బొమ్మ..
లేలేత పాదాల్ని ముద్దాడుతున్న.. కోయిలలో కోయిలమ్మలలో
ఆ మట్టి నేనైతే ఎంత బాగుండెనో.. కోయిలలో కోయిలమ్మలలో
మెల్లంగా విచేటి చల్లాటి గాలినై.. కోయిలలో కోయిలమ్మలలో
చెరిగిన కురులను సవరించిపోనా.. కోయిలలో కోయిలమ్మలలో
నువ్వు లేని బతుకే ఊహించలేనే.. కోయిలలో కోయిలమ్మలలో
పువ్వుల్లో పెట్టి నిన్ను చుసుకుంటనే….
మల్లె చెట్టు కింద కూసున్న మనసైన ఓ ముద్దు గుమ్మా..
లంగావోణీ ఏసుకొని దొంగ చూపు చూసుకుంటా
నా మనసు దోచినావే బొమ్మ..
MALLE CHETTU song is from the Folk Song - 10 movie.
MALLE CHETTU song was sung by Boddu Dilip Kumar.
MALLE CHETTU song lyrics were written by Gurram Sravan Kumar.
MALLE CHETTU song music was composed by Kalyan Keys.