
| Movie Name | Arjun |
|---|---|
| Director | Gunasekhar |
| Star Cast | Mahesh Babu, Shreya Saran, Keerthi Reddy |
| Music | Mani Sharma |
| Singer(s) | Unni Krishnan, Harini |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
మధుర మధురతర మీనాక్షీ
కంచి పట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షీ
కాశీలో విశాలాక్షీ
మధుర మధురతర మీనాక్షీ
కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షీ
కాశీలో విశాలాక్షీ
జాజి మల్లెల ఘుమఘుమల జావళీ
జాజి మల్లెల ఘుమఘుమల జావళీ
లేత సిగ్గుల సరిగమల జాబిలీ
అమ్మా మీనాక్షీ… ఇది నీ మీనాక్షి
వరములు చిలక…స్వరములు చిలక
కరమున చిలక కలదానా
హిమగిరి చిలక… శివగిరి చిలక
మమతలు చిలక దిగిరావా
మధుర మధురతర మీనాక్షీ
కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షీ
కాశీలో విశాలాక్షీ
అఙ్గారం వాగైనది… ఆ వాగే వైగైనది
ముడిపెట్టే ఏరైనది… విడిపోతే నీరైనది
భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడిలో తకధిమిత
విశ్వనాథుని ఏకవీర… ఆ తమిళ మహిళల వలపు గద
మనసే మథురై కొలువైన తల్లి మా మీనాక్షి
ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి
వరములు చిలక…స్వరములు చిలక
కరమున చిలక కలదానా
హిమగిరి చిలక… శివగిరి చిలక
మమతలు చిలక దిగిరావా
అందాలే అష్టోత్తరం… చదివించే సొగసున్నది
సొగసంతా నీరాజనం… అర్పించే మనసున్నది
మధురనేలు మా తెలుగు నాయకుల
మధుర సాహితీ రసికతలో
కట్టబొమ్మ తొడగొట్టి వేచిన తెలుగు వీర ఘన చరితలలో
తెలుగు తమిళం జతకట్టెనెన్నడో మీనాక్షి
మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి
మధుర మధురతర మీనాక్షీ
కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షీ
కాశీలో విశాలాక్షీ
జాజి మల్లెల ఘుమఘుమల జావళీ
జాజి మల్లెల ఘుమఘుమల జావళీ
లేతసిగ్గుల సరిగమల జాబిలీ
అమ్మా మీనాక్షీ… ఇది నీ మీనాక్షి
వరములు చిలక…స్వరములు చిలక
కరమున చిలక కలదానా
హిమగిరి చిలక… శివగిరి చిలక
మమతలు చిలక దిగిరావా
మధుర మధురతర మీనాక్షీ
కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షీ
కాశీలో విశాలాక్షీ
Madhura Madhura Meenakshi song is from the Arjun movie.
Madhura Madhura Meenakshi song was sung by Unni Krishnan, Harini.
Madhura Madhura Meenakshi song lyrics were written by Veturi Sundararama Murthy.
Madhura Madhura Meenakshi song music was composed by Mani Sharma.