Maagha Maasavela Song Lyrics - Ela Cheppanu

Maagha Maasavela Song Lyrics - Ela Cheppanu
Maagha Maasavela Song Lyrics: Maagha Maasavela is a Telugu song from the film Ela Cheppanu starring Tarun, Shreya, directed by Ramana B V. "Maagha Maasavela" song was composed by Koti and sung by Udit Narayan & Shreya Ghoshal. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Maagha Maasavela Song Details

Movie NameEla Cheppanu
DirectorRamana B V
Star CastTarun, Shreya
MusicKoti
Singer(s)Udit Narayan & Shreya Ghoshal
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Maagha Maasavela Song Lyrics in Telugu

(కళలు చిలుకు అలివేణి నుదుట

కస్తూరి తిలకమును దిద్దరే)

(సిగ్గులొలుకు చెలి పసిడి బుగ్గలకు

పసుపుతో నిగ్గు పెంచరే)

(కొత్త వెలుగు చూపించగలుగు

పారాణి పూసి నడిపించరే)

(కన్నె గోదారి వధువుగా మారి

కడలి కౌగిలికి చేరు తరుణమిది)

(వేడుకైన కళ్యాణ సమయమిది)

మాఘమాస వేళ… కోకిలమ్మ పాట

ప్రేమ పర్ణశాల… చూపుతున్న బాట

అనురాగం తోడు రాగా… నవలోకం ఏలుకోగా

శుభలగ్నం చేరుకుందని పిలిచేలా

ఓఓ ఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓఓ ఓఓ

మాఘమాస వేళ… కోకిలమ్మ పాట

(తందాన తందాన తానాన తానానా

తందాన తందాన తననన నా ఆ ఆ)

ఎవరిని నే చూసినా… అడుగులు ఎటు వేసినా

ఎదురయేది నువ్వే… నీకు తెలుసునా

నిను కలవని రోజున… గడవదు ఏం చేసినా

వదలనంది నన్నే తీపి యాతనా

నువ్వు వెతికే మజిలీ అవనా

నెచ్చెలిగా మదిలో చేరనా

ఇక అటు ఇటు ఎగరకే పావురమా

నా కౌగిలి కొలువున స్థిరపడుమా

తలపును దోచిన దొరతనమా

నా అనుమతి తమకిక అవసరమా

నన్ను నీలో నిన్ను నాలో నింపే నీ ప్రేమ

మాఘమాస వేళ… కోకిలమ్మ పాట

మనసుకి మలి జన్మగా

నువు మలిచిన బొమ్మగా

నిన్ను అల్లుకోనీ కొత్త ఊపిరి

హో, గగనము దిగి నేరుగా

ప్రియసఖిలా చేరగా

నన్ను కలుసుకుందా నింగి జాబిలి

నా మనవిని విననే వినవా

ఇది నిజమని అననే అనవా

నది నడకలు నేర్పిన సాగరమా

నీ ఒడిలో ఒదిగితే చాలు సుమా

తెలియని సైగల స్వాగతమా

ఈ బిడియము దేనికే సోయగమా

ఆగనీదు సాగనీదు చూడు ఈ ప్రేమ

మాఘమాస వేళ… కోకిలమ్మ పాట

అనురాగం తోడు రాగా… నవలోకం ఏలుకోగా

శుభలగ్నం చేరుకుందని పిలిచేలా

ఓఓ ఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓఓ ఓఓ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ela Cheppanu Movie

  1. Maagha Maasavela Song Lyrics
  2. Meghala Pallakilona Song Lyrics

Maagha Maasavela Song FAQ

What movie is Maagha Maasavela song from?

Maagha Maasavela song is from the Ela Cheppanu movie.

Who sang Maagha Maasavela song?

Maagha Maasavela song was sung by Udit Narayan & Shreya Ghoshal.

Who wrote Maagha Maasavela song lyrics?

Maagha Maasavela song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Maagha Maasavela song?

Maagha Maasavela song music was composed by Koti.