Maa Voori Devudu Song Lyrics - Alluda Majaka

Maa Voori Devudu Song Lyrics - Alluda Majaka
Maa Voori Devudu Song Lyrics: Maa Voori Devudu is a Telugu song from the film Alluda Majaka starring Chiranjeevi, Ramya Krishna, Ramba, directed by EVV Satyanarayana. "Maa Voori Devudu" song was composed by Koti and sung by S P Balasubramanyam. Lyrics were written by Veturi Sundararama Murthy.

Maa Voori Devudu Song Details

Movie NameAlluda Majaka
DirectorEVV Satyanarayana
Star CastChiranjeevi, Ramya Krishna, Ramba
MusicKoti
Singer(s)S P Balasubramanyam
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Maa Voori Devudu Song Lyrics in Telugu

ఓహో ఓహో ఓహో ఓహో ఓ ఓ ఓ

ఓహో ఓహో ఓహో ఓహో ఓ ఓ ఓ

మా ఊరి దేవుడు అందాల రాముడు

మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు

మా ఊరి దేవుడు అందాల రాముడు

మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు

ఓ రామా రఘురామా

(జగమేలే జయరామా)

కదిలి రావయ్యా కళ్యాణరామా

మనువు కోరింది సీతమ్మ

భళిరా భళిరా భళిరా

మా ఊరి దేవుడు, ఆ… అందాల రాముడు

మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు

చుక్కా చుక్కల లేడి రాంభజన

సూది కన్నుల లేడి రాంభజన

(చుక్కా చుక్కల లేడి రాంభజన, ఔను

సూది కన్నుల లేడి రాంభజన)

రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట

పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట

శ్రీరాముడి కళ్యాణమే, ఆహా

సీతమ్మకే వైభోగము, అరెరెరె

మాపల్లెకే పేరంటము, అహ అహ

లోకాలకే ఆనందము

ఒయ్ చైత్రమాస కోకిలమ్మ

పూలమేళమెట్టెనంట

నింగి వంగి నేల పొంగి

జంట తాళమేసెనంట, ఓ

చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా

తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా, ఓహో హో

తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి

వలచిన వరుడంటే రామచంద్రుడే, ఓహో హో

రాతినైన నాతిగ చేసి

కోతినైన దూతగ పంపే

మహిమే నీ కథ రామా

ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు

ధర్మానికే నీవు దైవానివైనావు

అన్నంటే నీవంటు ఆదర్శమైనావు

కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు

ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు

ఓ రామ నీ పెళ్లికే, ఏ ఏ ఏఏ

భళిరా భళిరా భళిరా

మా ఊరి దేవుడు

అందాల రాముడు

మా తల్లి సీతమ్మకు

శ్రీరాముడు దేవుడు

బిందె పానకం బిరబిర తిప్పు

రామచరిత హరికథగా చెప్పు

(బిందె పానకం బిరబిర తిప్పు

రామచరిత హరికథగా చెప్పు)

దేవుడి గుడిలో హారతి తిప్పు

తిప్పు తిప్పు తిప్పు

దేవుడి గుడిలో హారతి తిప్పు

దొరుకును దోసెడు వడపప్పు

(బిందె పానకం బిరబిర తిప్పు

రామచరిత హరికథగా చెప్పు

బిందె పానకం బిరబిర తిప్పు

రామచరిత హరికథగా చెప్పు)

ఏదిరా లక్ష్మణ.? సీతా

పర్ణశాలలో లేదెందు చేతా

విన్నాను మారీచ కూతా

వాడు లంకేశుడి మాయదూత

లేడల్లె వచ్చాడు ఘాత

వాణ్ణి బాణానికేస్తాను మేతా

ఏదిరా లక్ష్మణ.? సీతా

పర్ణశాలలో లేదెందు చేతా

ఏదిరా లక్ష్మణ.? సీతా

పర్ణశాలలో లేదెందు చేతా

నే నాడతా… నే పాడతా

నే నాడతా… నే పాడతా

వాడి అంతుచూసి నే నాడతా

వాడి గొంతుపిసికి నే పాడతా

నే నాడతా… నే పాడతా

నే నాడతా… నే పాడతా

రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా

మంధర మాటవినే కైక లేదురా, ఓహో హో

సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా

కలిమికి చోటు ఇదే కరువులేదురా, ఓహో హో

బుజ్జగింపు ఉడతకిచ్చి

పుణ్యమేమొ కప్పకిచ్చే

ఘనతే నీ కథ రామా

కంచర్ల గోపన్న బంధాలు తెంచావు

శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు

త్యాగయ్య గానాల తానాలు చేశావు

బాపూజీ ప్రాణాల కడమాటవైనావు

సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే

భూలోక కళ్యాణమే, ఏ ఏ ఏఏ

భళిరా భళిరా భళిరా

మా ఊరి దేవుడు అందాల రాముడు

మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు

మా ఊరి దేవుడు అందాల రాముడు

మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు

ఓ రామా రఘురామా

(జగమేలే జయరామా)

కదిలి రావయ్యా కళ్యాణరామా

మనువు కోరింది సీతమ్మ

భళిరా భళిరా భళిరా

మా ఊరి దేవుడు అందాల రాముడు

మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు

(మా ఊరి దేవుడు అందాల రాముడు

మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు)

Listen this Song in Online!

Share this Song!

More Songs from Alluda Majaka Movie

  1. Reddu Reddu Bugge Reddu Song Lyrics
  2. Pitta Kootha Pettara Song Lyrics
  3. Unga Unga Song Lyrics
  4. Chinna Papakemo Song Lyrics
  5. Maa Voori Devudu Song Lyrics

Maa Voori Devudu Song FAQ

What movie is Maa Voori Devudu song from?

Maa Voori Devudu song is from the Alluda Majaka movie.

Who sang Maa Voori Devudu song?

Maa Voori Devudu song was sung by S P Balasubramanyam.

Who wrote Maa Voori Devudu song lyrics?

Maa Voori Devudu song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Maa Voori Devudu song?

Maa Voori Devudu song music was composed by Koti.