| Movie Name | Gundamma Katha |
|---|---|
| Director | Kamalakara Kameswara Rao |
| Star Cast | N.T. Rama Rao, ANR, Savitri, Jamuna |
| Music | Ghantasala |
| Singer(s) | Ghantasala |
| Lyricist | Pingali Nagendra Rao |
| Music Label | Saregama Telugu |
లేచింది, నిద్ర లేచింది… మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది మహిళాలోకం
ఎపుడో చెప్పెను వేమనగారు
అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఎపుడో చెప్పెను వేమనగారు
అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా, ఆ ఆ ఆఆ
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
విస్సన్న చెప్పిన వేదం కూడా
లేచింది, నిద్ర లేచింది… మహిళాలోకం
పల్లెటూళ్ళలో పంచాయితీలు
పట్టణాలలో ఉద్యోగాలు
పల్లెటూళ్ళలో పంచాయితీలు
పట్టణాలలో ఉద్యోగాలు
అది ఇది ఏమని అన్ని రంగముల, ఆ ఆ ఆఆ
అది ఇది ఏమని అన్ని రంగముల
మగధీరులనెదిరించారు
నిరుద్యోగులను పెంచారు
లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం
చట్టసభలలో సీట్ల కోసం
భర్తలతోనే పోటీ చేసి
చట్టసభలలో సీట్ల కోసం
భర్తలతోనే పోటీ చేసి
ఢిల్లీ సభలో పీఠం వేసీ, ఈ ఈఈ ఈ
ఢిల్లీ సభలో పీఠం వేసి
లెక్చరులెన్నో దంచారు
విడాకు చట్టం తెచ్చారు
లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుషప్రపంచం
లేచింది, నిద్ర లేచింది
నిద్ర లేచింది మహిళాలోకం
Lechindi Nidra Lechindi song is from the Gundamma Katha movie.
Lechindi Nidra Lechindi song was sung by Ghantasala.
Lechindi Nidra Lechindi song lyrics were written by Pingali Nagendra Rao.
Lechindi Nidra Lechindi song music was composed by Ghantasala.