
| Movie Name | & English - Rudraveena |
|---|---|
| Director | K. Balachander |
| Star Cast | Chiranjeevi, Shobana, Gemini Ganesan |
| Music | Ilayaraja |
| Singer(s) | K J Yesudas & KS Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
Lalitha Priya Kamalam Lyrics in Telugu
లలిత ప్రియ కమలం విరిసినదీ
లలిత ప్రియ కమలం విరిసినది
కన్నుల కొలనిని, ఆఆ ఆ ఆ
ఉదయ రవికిరణం మెరిసినదీ
ఊహల జగతిని, హా ఆ ఆ ఆ
ఉదయ రవికిరణం మెరిసినదీ
అమృత కలశముగ… ప్రతి నిమిషం
అమృత కలశముగ… ప్రతి నిమిషం
కలిమికి దొరకని చెలిమిని
కురిసిన అరుదగు వరమిది
లలిత ప్రియ కమలం విరిసినదీ
రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం
కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంద్రచాపం
కాదా మన స్నేహం… ముడివేసే పరువం
కలల విరుల వనం… మన హృదయం
కలల విరుల వనం… మన హృదయం
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను
తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలుకల కిలకిల
తీగ సొగసుల తొణికిన మిలమిల
పాడుతున్నది ఎద మురళి
రాగఝరి తరగల మృదురవళి
తూగుతున్నది మరులవని
లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల దరహాసముల
మనసులు మురిసెను
లలిత ప్రియ కమలం విరిసినది
కన్నుల కొలనిని, ఆఆ ఆ ఆ
ఉదయ రవికిరణం మెరిసినది
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ
కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం… చూసే చూపే దీపం
కాదా మమకారం… నీ పూజా కుసుమం
మనసు హిమగిరిగా మారినది
మనసు హిమగిరిగా మారినది
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగ
మేని మలుపుల చెలువపు గమనము
వీణ పలికిన జిలిబిలి గమకము
కాలిమువ్వగ… నిలిచెను కాలము
పూల పవనము… వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం
వ్రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమపథం
సాగినది ఇరువురి బ్రతుకురథం
కోరికల తారకల సీమలకు
చేరుకొనె వడివడి పరువిడి
ఉదయ రవి కిరణం మెరిసినది
ఊహల జగతిని, ఆఆ ఆ ఆ
లలిత ప్రియ కమలం విరిసినది
కన్నుల కొలనిని, ఆఆ ఆ ఆ
లలిత ప్రియ కమలం విరిసినది
Lalitha Priya Kamalam song is from the & English - Rudraveena movie.
Lalitha Priya Kamalam song was sung by K J Yesudas & KS Chitra.
Lalitha Priya Kamalam song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Lalitha Priya Kamalam song music was composed by Ilayaraja.