
| Movie Name | |
|---|---|
| Director | Sriram Adittya |
| Star Cast | Akkineni Nagarjuna, Nani, Rashmika, Aakanksha Singh |
| Music | Mani Sharma |
| Singer(s) | Sri Krishna & Anurag Kulkarni |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
రాజాధిరాజా గణరాజా విగ్నేశ్వరాయ జయహో
గణపతి బప్పా మోరియా… మంగళ మూర్తి మోరియా
గణపతి బప్పా మోరియా… మంగళ మూర్తి మోరియా
గణపతి బప్పా మోరియా… మంగళ మూర్తి మోరియా
దేవా శ్రీ దేవా గణపతి దేవా… గజానన గణనాయ
మహారాజతు మహాకాయతు గణాధీశాయ మోరియా
దేవా శ్రీ దేవా గణపతి దేవా… గజానన గణనాయ
మహారాజతు మహాకాయతు గణాధీశాయ మోరియా
లక లక లకుమీకర లంభోదర
జగజగ జగదోద్దార విఘ్నేశ్వర
లక లక లకుమీకర లంభోదర
రకరకముల రూపాలు నీవే దొరా
వెళ్ళీ రారా మళ్ళీ రారా
ఏడాదికోసారి మాకై దిగి రారా
లోకంలో లోపాలు పాపాలన్నీ తుడిచెయ్రా
వెళుతూ వెళుతూ అట్టా గంగమ్మలో కలిపెయ్ రా
ధన్ ధనాధన్ ధరువెయ్ రా… తందానాల చిందెయ్ రా
పూనకంలో ఊగేయ్ రా… పంబ రేపేయ్ రా
రంగులన్నీ చల్లేయ్ రా… సంబరాలే చేసేయ్ రా
సాములోరిని మనసారా… సాగనంపెయ్ రా
లక లక లకుమీకర లంభోదర
జగజగ జగదోద్దార విఘ్నేశ్వర
లక లక లకుమీకర లంభోదర
రకరకముల రూపాలు నీవే దొరా
లాల పోసిన షర్వాణి కరుణున్నది నీలో
ఫాలనేత్రుని శూలాన పదునున్నది నీలో
మంచోళ్ళు మొత్తం చేరాలి నీ గూటికి
పేట్రేగు పాపం చెరగాలి నీ ధాటికి
ఓ కంట చల్లని జాలి
మరు కంట ఆగ్రహ కేళి
గడి దాటి నడిచే భూమి నడకను
చూపుతూ సరిదిద్దరా సామి
ధన్ ధనాధన్ ధరువెయ్ రా… తందానాల చిందెయ్ రా
పూనకంలో ఊగేయ్ రా… పంబ రేపేయ్ రా
రంగులన్నీ చల్లేయ్ రా… సంబరాలే చేసేయ్ రా
సాములోరిని మనసారా… సాగనంపెయ్ రా
బొజ్జ గణపతి సామి… భుజ్జెలుకని ఎక్కువే
భక్తితో బరువెంతైనా… సులువని అన్నావే
చాటంత చెవులు… ఎంచేత ఉన్నాయని
ఏ నోటి మంచి ఏమన్నా ఇనుకోమని
మరుగుజ్జు సామి దండం
పొడిగించి వక్రతుండం
మా బుద్ధి వంకర లెక్కలన్నీ
ఒక్క దెబ్బకి తొలిగించెయ్ రా
ధన్ ధనాధన్ ధరువెయ్ రా… తందానాల చిందెయ్ రా
పూనకంలో ఊగేయ్ రా… పంబ రేపేయ్ రా
రంగులన్నీ చల్లేయ్ రా… సంబరాలే చేసేయ్ రా
సాములోరిని మనసారా… సాగనంపెయ్ రా
ధన్ ధనాధన్ ధరువెయ్ రా… తందానాల చిందెయ్ రా
పూనకంలో ఊగేయ్ రా… పంబ రేపేయ్ రా
రంగులన్నీ చల్లేయ్ రా… సంబరాలే చేసేయ్ రా
సాములోరిని మనసారా… సాగనంపెయ్ రా
Laka Laka Lakumikara song is from the movie.
Laka Laka Lakumikara song was sung by Sri Krishna & Anurag Kulkarni.
Laka Laka Lakumikara song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Laka Laka Lakumikara song music was composed by Mani Sharma.