
| Movie Name | Indrudu Chandrudu (1989) |
|---|---|
| Director | Suresh Krissna |
| Star Cast | Kamal Haasan, Vijayashanti |
| Music | Ilayaraja |
| Singer(s) | SP Balasubramanyam |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
లాలిజో లాలిజో… ఊరుకో పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
లాలిజో లాలిజో… ఊరుకో పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నాచేయి
తెలుసా ఈ ఊసు..? చెబుతా తల ఊచూ
కాపురం చేస్తున్నా పావురం ఒకటుంది
ఆలినే కాదందీ… కాకినే కూడింది
అంతలో ఏమైంది…? అడగవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
మ్మ్ మ్ మ్మ్ మ్…..
ఆ తరువాత..! శాంతి ఎక్కడ..? మన శాంతి ఎక్కడ..?
మ్మ్ మ్ మ్మ్ మ్… మ్మ్ మ్ మ్మ్ మ్
మాయనే నమ్మింది… బోయతో పోయింది
దెయ్యమే పూనిందో… రాయిలా మారింది
వెళ్ళే పెడదారిలో… ముళ్ళే పొడిచాకనే
తప్పిదం తెలిసింది… ముప్పునే చూసింది
కన్నులే విప్పిందీ… గండమే తప్పింది
ఇంటిలో చోటుందా..? చెప్పవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
మ్మ్ మ్ మ్మ్ మ్… మ్మ్ మ్ మ్మ్ మ్
పిల్లలు ఇల్లాలూ… ఎంతగా ఏడ్చారు
గుండెలో ఇన్నాళ్ళు… కొండలే మోశారు
నేరం నాదైనా… భారం మీ పైన
తండ్రినే నేనైనా… దండమే పెడుతున్నా
తల్లిలా మన్నించు… మెల్లగా దండించు
కాళిలా మారమ్మా… కాలితో తన్నమ్మా
బుద్దిలో లోపాలే… దిద్దుకోనీవమ్మా
మ్మ్ మ్ మ్మ్ మ్
లాలిజో లాలిజో… ఊరుకో పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
Laali Jo Laali Jo song is from the Indrudu Chandrudu movie.
Laali Jo Laali Jo song was sung by SP Balasubramanyam.
Laali Jo Laali Jo song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Laali Jo Laali Jo song music was composed by Ilayaraja.