
| Movie Name | Arya's Captain |
|---|---|
| Director | Shakti Soundar Rajan |
| Star Cast | Arya, Aishwarya Lekshmi, Kavya Shetty, Simran |
| Music | D Imman |
| Singer(s) | Srinisha Jayaseelan, Yazin Nizar |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | Think Music India |
నందలాల నా కలకు
అందం నువ్వేనురా
నందలాల ఆశలకు
అద్దం నువ్వేనురా
ఇపుడే ఇపుడే ఎదురైనా నువ్వు
గుండెల్లోన చప్పుడై ఎదిగావురా
ఇపుడే ఇపుడే వెలుగైన నువ్వు
కంటి రెప్ప చాటున ఒదిగావురా
తొలి తొలి తొలకరి వర్షం నీవుగా
తలపులు నిండారా తడిపావురా
కైలా కైలాల లాలా… కైలా కైలా కైలా
కవిలా, మారానే నీపై కవితలు రాసేలా
కైలా కైలాల లాలా… కైలా కైలా కైలా
కదిలా, నీ ఊహలకే… నే ఊపిరి పోసేలా
నందలాల నా కలకు
అందం నువ్వేనురా
నందలాల ఆశలకు
అద్దం నువ్వేనురా
కైలా కైలాల లాలా… కైలా కైలా కైలా
కవిలా, మారనే నీపై కవితలు రాసేలా
హా కన్నదేలా ఎల్లలన్నీ
కాపు కాసే మహావీరా
కన్ను చాటు పాపలాగా
నన్ను కూడా చూస్తావా
ఇరువురు మనసుల పరిచయమిది
ఎన్ని వేల వేల యుగమలదో
ఇరువది టెన్ టు ఫైవ్ వయసిది
నిన్ను నేడు మళ్ళీ చూసి
ఇంతలేసి మురిసినదో
కైలా కైలా కుడి కన్నే అదిరే ఈ వేళ
కైలా కైలా నా పాలి లైలా
కైలా కైలా దూరంగ మురిపించె వేళ
కైలా కైలా కౌగిలికే రా ఇలా
కాలి కాలి కన్నులతో వెన్నెల నీవేనురా
కాలి కాలి ఊహలకు ఊపిరివైనావురా
ఏదురై వెతికే వయ్యారి ఈడును
వెలుగుగ మార్చిన చిరుగాలివే
నిదుర కుదురు మరిచేకు
నా సగ వయసును కుదిపిన వనమాలివే
పరువపు సంద్రాన పండుగై లేపిన
తుంటరి తుఫాను నీ అలికిడే
కైలా కైలాల లాలా… కైలా కైలా కైలా
కలలా, కలిసావే నాలో మల్లెల మధుబాల
కైలా కైలాల లాలా… కైలా కైలా కైలా
కధలా, కదిలావే నాతో జన్మల జవరాల, కైలా
Kylaa song is from the Arya's Captain movie.
Kylaa song was sung by Srinisha Jayaseelan, Yazin Nizar.
Kylaa song lyrics were written by Ramajogayya Sastry.
Kylaa song music was composed by D Imman.