
| Movie Name | Devatha (1982) |
|---|---|
| Director | K. Raghavendra Rao |
| Star Cast | Sobhan Babu, Sridevi, Jaya Prada |
| Music | K. Chakravarthy |
| Singer(s) | SP Balu, P Susheela |
| Lyricist | Veturi |
| Music Label | Saregama Telugu |
కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని
ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడ్ని
కుడికన్ను కొట్టగానే కుర్రాన్ని
ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడ్ని
ఆ రెండు కళ్ళు కొట్టరాదా
నన్ను రెచ్చగొట్టి చూడరాదా
వంకాయ్… హొయ్ హొయ్
కుడికన్ను కొట్టగానే కుర్రోడా
ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
కుడికన్ను కొట్టగానే కుర్రోడా
ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
ఆ రెండుకళ్ళు కొట్టనేలా
ఈ గుండె తలుపు తట్టనేలా
వంకాయ్… హయ హయ్
కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని
ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
గుమ్మా, ముద్దుగుమ్మా
ముద్దు గుమ్మాలు దాటింది లెమ్మంటా
అరె, అమ్మో… ఎవడి సొమ్మో
దాచుకోకమ్మో దోచాలి రమ్మంటా
జోరుగా నీరునారుగా
పచ్చపైరల్లే ఉర్రూతలూగాలంటా
ఊగాలా, తత్తరపడి విచ్చలవిడి ఉయ్యాలా
నిద్దరచెడి ముద్దరపడి పొద్దుల గురితప్పాల
ముద్దుల ముడి విప్పాల
అల్లరిపడి సందేల… మల్లెలతో చెప్పాలా
వంకాయ్…హొయ్ హొయ్
కుడికన్ను కొట్టగానే కుర్రోడా
ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా
ఆ రెండు కళ్ళు కొట్టరాదా
నన్ను రెచ్చగొట్టి చూడరాదా
బుగ్గో, పూతమొగ్గో
కొత్త బేరాలు కోరింది రమ్మంట
అహ, సిగ్గో చిలిపి ముగ్గో
పట్టపగ్గాలు లేవంది తెమ్మంట
జోడుగా ఏరు నీరుగా
పల్లెసీమల్లో ఊరేగి పోవాలంట
రేగాలా, బిత్తర చెలి చూపులు సుడి రేగాలా
నడిరాతిరి కొన ఊపిరి చక్కిలిగిలి కాగాలా
దిక్కులు చలికూగాలా… చుక్కలు దిగి రావాలా
మొక్కుబడులు చెయ్యాలా
వంకాయ్…హొయ్ హొయ్
కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని
ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడ్ని
కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని
ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడ్ని
ఆ రెండుకళ్ళు కొట్టనేలా
ఈ గుండె తలుపు తట్టనేలా
Kudikannu Kottagane song is from the Devatha movie.
Kudikannu Kottagane song was sung by SP Balu, P Susheela.
Kudikannu Kottagane song lyrics were written by Veturi.
Kudikannu Kottagane song music was composed by K. Chakravarthy.