Krishnam Vande Jagadgurum Song Lyrics - Krishnam Vande Jagadgurum

Krishnam Vande Jagadgurum Song Lyrics - Krishnam Vande Jagadgurum
Krishnam Vande Jagadgurum Song Lyrics: Krishnam Vande Jagadgurum is a Telugu song from the film Krishnam Vande Jagadgurum starring Rana Daggubati, Nayanthara, Kota Srinivasa Rao, directed by Krish. "Krishnam Vande Jagadgurum" song was composed by Mani Sharma and sung by S P Balasubramanyam. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Krishnam Vande Jagadgurum Song Details

Movie NameKrishnam Vande Jagadgurum
DirectorKrish
Star CastRana Daggubati, Nayanthara, Kota Srinivasa Rao
MusicMani Sharma
Singer(s)S P Balasubramanyam
LyricistSirivennela Seetharama Sastry
Music LabelSaregama South

Krishnam Vande Jagadgurum Song Lyrics in Telugu

Krishnam Vande Jagadgurum Lyrics – జరుగుతున్నదీ జగన్నాటకం సాంగ్

జరుగుతున్నదీ జగన్నాటకం… జరుగుతున్నదీ జగన్నాటకం

పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కధనం… నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్ధం

జరుగుతున్నది జగన్నాటకం… జరుగుతున్నది జగన్నాటకం…

చెలియలి కట్టను తెంచుకుని… విలయము విజృంభించునని

ధర్మ మూలమే మరచిన జగతిని… యుగాంతమెదురై ముంచునని

సత్యవ్రతునకు సాక్షాత్కరించి… సృష్టి రక్షణకు చేయూతనిచ్చి

నావగ త్రోవను చూపిన మత్స్యం… కాలగతిని సవరించిన సాక్ష్యం

చేయదలచిన మహత్కార్యము… మోయజాలని భారమైతే

పొందగోరినదందలేని నిరాశలో అణగారి పోతే…

బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక…

ఓటమిని ఓడించగలిగిన… ఓరిమే కూర్మమన్నది

క్షీరసాగర మధనమర్మం…!!!

ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలుపగ… ఉరికే ఉన్మాదమ్మును

కరాళదంషృల కుళ్ళగించి… ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల

ధీరోద్దథి రణహుంకారం… ఆది వరాహపు ఆకారం

ఏడీ ఎక్కడరా నీ హరి దాక్కున్నాడేరా…

భయపడి బయటకు రమ్మనరా…

ఎదుటపడి నన్ను గెలవగాలడా… తలబడి..!!

నువ్వు నిలిచిన ఈ నేలని అడుగు…

ఈ నాడుల జీవజలమ్ముని అడుగు…

నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు… నీ ఊపిరిలో గాలిని అడుగు

నీ అడుగుల ఆకాశాన్నడుగు… నీలో నరునీ హరినీ కలుపు

ననీవే నరహరివని నువు తెలుపు..!!!

ఉన్మత్త మాతంగ భంగి కాటుక విధతి…

మంత్రు సంగాతమీ ధృడమి విడమీ జగతి…

అహము రణమై ఎదిగే అవనికిదే అసనిహతి…

అతతాయుల నిహతి అనివార్యమౌ నియతి…

చితహస్తి హతమస్తకాది నఖసమకాసియో

కౄరాసి క్రోసి హృతదాయదంస్త్రుల ద్రోసి మసిచేయ మహిత యంత్రం…

అమేయమనూహ్యమనంత విశ్వం…

ఆ భ్రహ్మండపు సూక్ష్మ స్వరూపం… ఈ మానుష రూపం

కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింప చేసే… అల్ప ప్రమాణం

ముజ్జగాలనూ మూడడుగులతో కొలిచే… త్రైవిక్రమ విస్తరణం…

జరుగుతున్నదీ జగన్నాటకం… జగ జగ జగ జగమే నాటకం

జరుగుతున్నదీ జగన్నాటకం… జగ జగ జగ జగమే నాటకం

పాపపు తరువై పుడమికి బరువై… పెరిగిన ధర్మగ్యానిని పెరుగగ

పరశురాముడై భయద భీముడై… పరశురాముడై భయద భీముడై

ధర్మాగ్రహనిగ్రహుడై నిలచిన… శౌత్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు

ఏ మహిమలూ లేక… ఏ మాయలూ లేక

నమ్మశక్యము గాని ఏ మర్మమూ లేక…

మనిషి గానే పుట్టి… మనిషి గానే బ్రతికి

మహిత చరితగ మహిని… మిగలగలిగే మనికి

సాధ్యమేనని పరంధాముడే… రాముడై ఇలలోన నిలచె…

ఇన్ని రీతులుగా… ఇన్నిన్ని పాత్రలుగా

నిన్ను నీకే నూత్నపరిచితునిగా…

దర్శింప చేయగల జ్ఞానదర్పణము… కృష్ణావతారమే సృష్ట్యావరణతరణమూ

అలిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా…

ఈశత్వముగా వశిత్వమ్ముగా… నీలోని అష్టసిద్ధులూ నీకు తన్బట్టగా

స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా…

నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా…

తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే

నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే…

వందే కృష్ణం జగద్గురుం… వందే కృష్ణం జగద్గురుం

కృష్ణం వందే జగద్గురుం … కృష్ణం వందే జగద్గురుం

వందే కృష్ణం జగద్గురుం… వందే కృష్ణం జగద్గురుం

కృష్ణం వందే జగద్గురుం… కృష్ణం వందే జగద్గురుం

కృష్ణం వందే జగద్గురుం………

Listen this Song in Online!

Share this Song!

More Songs from Krishnam Vande Jagadgurum Movie

  1. Sye Andri Naanu Song Lyrics
  2. Krishnam Vande Jagadgurum Song Lyrics

Krishnam Vande Jagadgurum Song FAQ

What movie is Krishnam Vande Jagadgurum song from?

Krishnam Vande Jagadgurum song is from the Krishnam Vande Jagadgurum movie.

Who sang Krishnam Vande Jagadgurum song?

Krishnam Vande Jagadgurum song was sung by S P Balasubramanyam.

Who wrote Krishnam Vande Jagadgurum song lyrics?

Krishnam Vande Jagadgurum song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Krishnam Vande Jagadgurum song?

Krishnam Vande Jagadgurum song music was composed by Mani Sharma.