
| Movie Name | Nenu Premisthunnanu |
|---|---|
| Director | EVV Satyanarayana |
| Star Cast | JD Chakravarthy, Rachna Banerjee |
| Music | Sirpi |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
అరెయ్ అరేయ్… తొందరగా పాడరా బాబు
అవతల సిగరెట్ సాంగా… చూసే సాంగా అని
ఆడియన్స్ అంతా… వెయిట్ చేస్తున్నారు
తొందరగా పాడు… కమాన్ సింగ్
కోవెల్లో, ఆఆ ఆఆ… దీపంలా, ఆఆ ఆఆ
కావ్యంలో, ఆఆ ఆఆ… భావంలా, ఆఆ ఆఆ
తెలుగింటి కాంతరా… తొలి సంధ్య కాంతిరా
నా యదలో ఊయలూగుతోందిరా, ఊగుతోందిరా, ఆ ఆ
కోవెల్లో, ఆఆ ఆఆ… దీపంలా, ఆఆ ఆఆ
తెలుగింటి కాంతరా… తొలి సంధ్య కాంతిరా
బాగానే ఉందికాని ఇంతకి నువ్వు ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయికి తెలుసా..?
ఉహూ..!
మరి ఆ అమ్మాయి నో అంటే ఏమి చేస్తావ్..?
దేవదాసునైపోతా..!
నీకు మందు అలవాటు లేదుకదరా..?
చేసుకుంటా తాగుతుంటా..!
ఆ సీన్ తరువాత.
ముందు ఆ పిల్ల ఊరు పేరు చెప్పు.
సౌందర్యం, ఆఆ ఆఆ… అమ్మడి ఊరు, ఆఆ ఆఆ
లావణ్యం, ఆఆ ఆఆ… ఆ చెలి పేరు, ఆఆ ఆఆ
కూర్చోని ఉంటే చూసే… గుండెలు ఊగాలి
తను కదిలిందంటే… సాగే కాలం ఆగాలి
ఆ నవ్వుకు నేనే దాసోహం
ఏ పువ్వుకు లేదే ఆ సుకుమారం
ఓ ఓ కోవెల్లో, ఆఆ ఆఆ… దీపంలా, ఆఆ ఆఆ
తెలుగింటి కాంతరా… తొలి సంధ్య కాంతిరా
ఆహా ఓహో…! ఏంటిరా, మనోడు సూపర్ గా చెప్తున్నాడురా.
నువ్వుండవోయ్..! అరేయ్ తొందరగా చెప్పరాబాబు, ఆ.
ఊహల్లో, ఆఆ ఆఆ… ఊర్వశులైనా, ఆఆ ఆఆ
ఊరించే, ఆఆ ఆఆ… మేనకలైనా, ఆఆ ఆఆ
ఆ చిన్నారిని… చూశారంటే చినబోరా
తన చెలికత్తెలుగా… ఉంటే చాలని అనుకోరా
ఏ కలలో లేదే… ఆ అందం
తను కనిపిస్తేనే… కళ్ళకు అర్ధం
కోవెల్లో, ఆఆ ఆఆ… దీపంలా, ఆఆ ఆఆ
కావ్యంలో, ఆఆ ఆఆ… భావంలా, ఆఆ ఆఆ
తెలుగింటి కాంతరా… తొలి సంధ్య కాంతిరా
నా యదలో ఊయలూగుతోందిరా, ఊగుతోందిరా, ఆ ఆ
కోవెల్లో, ఆఆ ఆఆ… దీపంలా, ఆఆ ఆఆ
తెలుగింటి కాంతరా… తొలి సంధ్య కాంతిరా
లలలాలలా లలలాలలా లలలాలలా
Kovello Deepamla song is from the Nenu Premisthunnanu movie.
Kovello Deepamla song was sung by S P Balasubramanyam.
Kovello Deepamla song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Kovello Deepamla song music was composed by Sirpi.