Koti Kaanthula Velugulatho Song Lyrics

Koti Kaanthula Velugulatho Song Lyrics
Koti Kaanthula Velugulatho Song Lyrics: Koti Kaanthula Velugulatho is a Telugu song. "Koti Kaanthula Velugulatho" song was composed by Bapu Kondeti and sung by Anjana Sowmya. Lyrics were written by Bapu Kondeti.

Koti Kaanthula Velugulatho Song Details

Movie Name
Director
Star Cast
MusicBapu Kondeti
Singer(s)Anjana Sowmya
LyricistBapu Kondeti
Music LabelAngels Melody

Koti Kaanthula Velugulatho Song Lyrics in Telugu

కోటి కాంతుల వెలుగులతో

ఉదయించెను ఒక కిరణం

లోకమందున ప్రతి హృదయం

చిగురించెను ఈ తరుణం

దివిని విడిచి… భువిన మనకై

మానవునిగా జన్మించెను

దిగులు చెందక… గతము మరచి

యేసుని ఆరాధింతుము

లోకానికే ఇది పర్వదినం

మహదానందమే ప్రతి క్షణం

లోకానికే ఇది పర్వదినం

మహదానందమే ప్రతి క్షణం ||కోటి కాంతుల||

రాజులకు రాజుల రాజు

ప్రభువులకు ప్రభువే తానుగా

మనుజులకు మాదిరి తానై

ఉండుటకే ఇల యేతెంచెగా ||2||

మనకోసమే జన్మించెను

తన ప్రేమనే పంచెను

ఆ వరమునే తను విడచెను

నరరూపిగా వెలసెను

సృష్టికే మూలాధారమైన

దేవుడే ఇల దిగి వచ్చెనా

శోధనా బాధలు ఎన్ని ఉన్నా

నేటితో ఇక దరి చేరునా

ఆనందమే ఇక సంతోషమే

ప్రతివానికి శుభపరిణామమే

ఆనందమే ఇక సంతోషమే

ప్రతివానికి శుభపరిణామమే ||కోటి కాంతుల||

మహిమగల మహిమోన్నతుడు

పశువులశాలలో పసివానిగా

కరుణగల కారణజన్ముడు

శిశువుగా మనలో ఒకవానిగా ||2||

ఏనాటికీ మన తోడుగా

ఉండాలని అండగా

ప్రతివానికీ స్నేహితునిగా

హృదయాన జన్మించెగా

అంధకారపు ఈ లోకమందు

దేవదేవుడు ఉదయించెగా

ఎన్నడూ లేని… వేవేల కాంతులు

లోకమందున పవళించెగా

సంతోషమే సమాధానమే

ఇది దేవాది దేవుని బహుమానమే

సంతోషమే సమాధానమే

ఇది దేవాది దేవుని బహుమానమే ||కోటి కాంతుల||

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Koti Kaanthula Velugulatho Song FAQ

What movie is Koti Kaanthula Velugulatho song from?

Koti Kaanthula Velugulatho song is from the movie.

Who sang Koti Kaanthula Velugulatho song?

Koti Kaanthula Velugulatho song was sung by Anjana Sowmya.

Who wrote Koti Kaanthula Velugulatho song lyrics?

Koti Kaanthula Velugulatho song lyrics were written by Bapu Kondeti.

Who composed music for Koti Kaanthula Velugulatho song?

Koti Kaanthula Velugulatho song music was composed by Bapu Kondeti.