
| Movie Name | & English - Kondaveeti Donga (1990) |
|---|---|
| Director | A. Kodandarami Reddy |
| Star Cast | Chiranjeevi, Vijayashanti, and Radha |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam, S Janaki |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
చలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా
లాటుగా అందాలన్ని… చాటుగా ఇస్తావా
ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి… మాటుకోమంటావా
కోలో కోలమ్మ గళ్ళ కోకే… కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
చలో నీ సోకులన్ని… సోలోగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా
కొండకోనల్లో చాటుగా… ఎత్తు పల్లాలు తెలిసేలే
కంటి కోణాలు సూటిగా… కొంటె బాణాలు విసిరేలే
సోకి నా ఒళ్ళు కోకలోగళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలనూ
చూపుకే సుళ్ళు తిరిగి నా ఒళ్ళు కట్టు కౌగిళ్ళు వదలకూ
కుదేశాక అందాలన్ని… కుదేలైన వేళల్లో
పడేశాకా వల్లో నన్నే… ఒడే చాలు ప్రేమల్లో
సందె ఓ షేపు చిందే ఓ వైపు… అందే నీ సోకులే
తణక్కు దిన్న చలో
నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
మెత్తగా తాకు చూపుకే… మేలుకొన్నాయి సొగసులే
కోత్తగా తాకు గాయమే… హాయి అన్నాయి వయసులే
కుర్ర నా ఈడు గుర్రమై తన్నే… గుట్టుగా గుండెలదరగా
కళ్ళతో నీకు కళ్ళెమేశాను… కమ్ముకో నన్ను కుదురుగా
భరోసాల వీరా రారా… భరిస్తాను నీ సత్తా
శృతేమించు శృంగారంలో… రతే నీకు మేనత్తా
ముద్దు ఆ వైపు రుద్దు ఈ వైపు… హద్దులే లేవులే
తణక్కు దిన్న
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
చలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా
లాటుగా అందాలన్ని… చాటుగా ఇస్తావా
ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మాటుకోమంటావా
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
హెయ్, చలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా ఆ ఆ
Kolo Kolamma song is from the & English - Kondaveeti Donga movie.
Kolo Kolamma song was sung by S P Balasubramanyam, S Janaki.
Kolo Kolamma song lyrics were written by Veturi Sundararama Murthy.
Kolo Kolamma song music was composed by Ilayaraja.