
| Movie Name | Pelli Chesukundam (1997) |
|---|---|
| Director | Muthyala Subbaiah |
| Star Cast | Venkatesh, Soundarya and Laila |
| Music | Koti |
| Singer(s) | S P Balasubramanyam, KS Chitra |
| Lyricist | Sai Sri Harsha |
| Music Label |
కోకిల కోకిల కూ అన్నది… వేచిన ఆమని ఓ యన్నది
దేవత నీవని మమతల కోవేల… తలుపు తెరిచి ఉంచాను
ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో… సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో
కోకిల కోకిల కూ అన్నది… అహ ఆహా హా
వేచిన ఆమని ఓ అన్నది… అహ ఆహా హా
గుండె గూటిలో నిండిపోవా… ప్రేమ గువ్వలాగ ఉండిపోవా
ఏడు అడుగుల తోడు రావా.. జన్మ జన్మ నందు నీడకావా
లోకం మన లోగిలిగా… కాలం మన కౌగిళిగా
వలపే శుభ దీవెనగా… బ్రతుకే ప్రియ భావనగా
ఆ ఆకాశాలే అందే వేళ… ఆశలు తీరెనుగా… ఆ ఆ
కోకిల కోకిల కూ అన్నది… అహ ఆహా హా
వేచిన ఆమని ఓ అన్నది… అహ ఆహా హా
వాలు కళ్ళతో వీలునామా… వీలు చూసి ఇవ్వు చాలు భామ
వేళపాలలు ఏలనమ్మా… వీలు లేనిదంటూ లేదులేమ్మా
మనమేలే ప్రేమికులం… మనదేలే ప్రేమ కులం
కాలన్ని ఆపగలం… మన ప్రేమను చూపగలం
కల్లలన్నీ తీరే కమ్మని క్షణమే… కన్నుల ముందుందమ్మ…
కోకిల కోకిల కూ అన్నది… వేచిన ఆమని ఓ యన్నది
దేవత నీవని మమతల కోవేల… తలుపు తెరిచి ఉంచాను
ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో…
సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో…
Kokila Kokila Koo Annadi song is from the Pelli Chesukundam movie.
Kokila Kokila Koo Annadi song was sung by S P Balasubramanyam, KS Chitra.
Kokila Kokila Koo Annadi song lyrics were written by Sai Sri Harsha.
Kokila Kokila Koo Annadi song music was composed by Koti.